SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కమిన్స్ కాక వస్తున్నాడహో!
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అభిమానులకు గుడ్ న్యూస్. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రీఎంట్రీకి రంగం సిద్దమైంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న కమిన్స్.. జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జట్టుతో కలిసిన కమిన్స్.. ఆ తర్వాత తిరిగిన ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. బుధవారం కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.
ఈ టెస్ట్‌లో కమిన్స్ నెగ్గితే ఈ నెల 17న భారత్‌కు వస్తారని తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో కమిన్స్ బరిలోకి దిగుతాడని పేర్కొంది. యాషెస్ సిరీస్‌కు ముందే గాయపడిన కమిన్స్.. కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఈ గాయంతోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు.

ఈ సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసిన కమిన్స్.. కుర్రాళ్లకు దిశానిర్దేశం చేశాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌కు ముందు జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. వార్మప్, ఫీల్డింగ్, క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడు. తక్కువ రనప్‌తో ఖాళీ నెట్స్‌లో కొన్ని బంతులు కూడా బౌలింగ్ చేశాడు. టీమ్ సోషల్ మీడియా టీమ్‌తో మాట్లాడుతూ.. సెకండాఫ్ సీజన్‌కు అందుబాటులో ఉంటానని, ఫ్యాన్స్ దిగులు చెందవద్దని తెలిపాడు.
'నేను వెన్ను గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. చిన్నగా నెట్స్‌లో బౌలింగ్ కూడా చేయగలుగుతున్నా. ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కానుంది. కానీ నేను ఆరంభ మ్యాచ్‌లు ఆడలేకపోతున్నా. టోర్నీ మధ్యలో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే నేను టోర్నీ రెండో భాగం, ఫైనల్స్‌లో మైదానంలోకి దిగుతాను' అని కమిన్స్ తెలిపాడు.
కమిన్స్ గైర్మాజరీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇషాన్ కిషన్ నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ 2 గెలిచి మూడింటిలో ఓడింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 57 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో ఆరెంజ్ ఆర్మీ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఏప్రిల్ 18న(శనివారం) ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications