IPL 2026: పాపం సీఎస్‌కే.. ఫామ్‌లో ఉన్న ఆ ఒక్కడు కూడా దూరం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ ఆరంభం నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయం కారణంగా ఈ సీజన్‌లోని మిగిలిన అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ముంబైకి చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నిష్క్రమించడం సీఎస్‌కే అభిమానులను నిరాశకు గురిచేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మూడో స్థానంలో ఆడుతున్న ఆయుష్ మాత్రే తొడ కండరాల గాయంతో ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గత శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే బ్యాటింగ్ చేస్తుండగా కండరాలు పట్టేసాయి. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ యువ బ్యాటర్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సీఎస్‌కే అధికారికంగా ప్రకటించింది.
'ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ మాత్రేకి ఎడమ తొడ కండరాల్లో గాయమైంది. టియర్ ఉండటంతో అతను ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆయుష్ మాత్రే కోలుకోవడానికి 6-12 వారాల విశ్రాంతి అవసరం. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని సీఎస్‌కే తమ ప్రకటనలో పేర్కొంది.

ఆయుష్ మాత్రే గైర్హాజరీ సీఎస్‌కే జట్టుకు తీవ్ర నష్టం చేయనుంది. జట్టులో నిలకడగా రాణిస్తున్న ఏకైక ప్లేయర్ ఆయుష్ మాత్రే మాత్రమే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆయుష్ మాత్రే.. రెండు హాఫ్ సెంచరీలతో 201 పరుగులు చేసాడు. ముఖ్యంగా చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌పై 73 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 59 పరుగులతో రాణించాడు.
ఆయుష్ మాత్రే స్థానంలో ఉర్విల్ పటేల్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. ఇప్పటికే నాథన్ ఎల్లిస్, ధోనీ, ఖలీల్ అహ్మద్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండగా.. ఈ జాబితాలో ఆయుష్ మాత్రే చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications