బౌలింగ్ కాదు.. ఆ రెండు క్యాచ్‌లే మమ్మల్ని గెలిపించాయి: భువనేశ్వర్ కుమార్
తాను ఫైన్ వైన్‌లా వయసు పెగుతున్నా కొద్దీ మెరుగవుతున్నానని రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఐపీఎల్ మాత్రమే ఆడుతుండటంతో కావాల్సిన విశ్రాంతి లభిస్తుందని, దాంతో తన బౌలింగ్ మరింత మెరుగవ్వడానికి ఉపయోగపుడుతుందని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్(3/27) మూడు వికెట్లతో సత్తా చాటాడు.
అతనితో పాటు రసిక్ సలామ్(4/24), కృనాల్ పాండ్యా(2/36) నిప్పులు చెరగడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆర్‌సీబీ 15.1 ఓవర్లలోనే 149 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో సునాయస విజయాన్నందుకుంది.

ఫీల్డింగ్‌తో ఓడించాం..
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్.. అద్భుతమైన ఫీల్డింగ్‌తోనే లక్నోను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయగలిగామని చెప్పాడు. ముఖ్యంగా టీమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ పట్టిన క్యాచ్‌లు మ్యాచ్‌ను మలుపు తిప్పాయని తెలిపాడు.
'ఈ ఘనత బౌలర్లందరిది. మా అనుభవం, ప్రణాళికలు బాగా పనిచేశాయి. నా ఎడమ చేతి బౌలింగ్ చేయడానికి బాగానే ఉంది. కానీ, ఫీల్డింగ్ చేయడానికి మాత్రం అంత అనుకూలంగా లేదు. మా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యర్థి జట్టును త్వరగా ఆలౌట్ చేయాలంటే ఇలాంటి క్యాచ్‌లు పట్టడం చాలా అవసరం. ముఖ్యంగా సాల్ట్, టిమ్ పట్టిన ఆ రెండు క్యాచ్‌లు అద్భుతం. వారిని 150 పరుగుల లోపే ఆలౌట్ చేయడానికి అవే ప్రధాన కారణం.
నేను ఫైన్ వైన్ లాంటోడిని
నేను వయసు పెరుగుతున్న కొద్దీ 'ఫైన్ వైన్' లాగా మెరుగవుతున్నాను (నవ్వుతూ). ఐపీఎల్ తర్వాత నాకు చాలా సమయం దొరుకుతుంది. ఆ విరామం నేను బలాన్ని పుంజుకోవడానికి, తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.
ఇది రెండేళ్ల క్రితం ఎలా ఉండేదో, సరిగ్గా అలాంటి చిన్నస్వామి వికెట్. కొద్దిగా స్వింగ్ అవుతోంది కానీ బంతి బ్యాట్‌పైకి చాలా బాగా వస్తోంది. బౌలర్‌గా మీరు సరైన చోట బంతులు వేయాలి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే, మీరు బంతిని సరిగ్గా టైమింగ్ చేయగలిగితే, ఇది ఏ బ్యాటింగ్ వికెట్ కన్నా తక్కువ కాదు.'అని భువనేశ్వర్ కుమార్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications