DC vs KKR: అక్కడే మ్యాచ్ పోయింది: అక్షర్ పటేల్
బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. రెండు, మూడు ఓవర్ల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయామని, అక్కడే మ్యాచ్‌పై పట్టు కోల్పోయామని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అక్షర్ పటేల్.. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు స్పిన్నర్ల తప్పిదాలు కూడా ఓటమికి కారణమయ్యాయని తెలిపాడు. 'మేం చేసిన పరుగులు చాలా తక్కువ. అదే మా స్పిన్నర్లు కూడా కొన్ని తప్పులు చేశారు. పిచ్ స్పందించిన తీరును చూసే ఈ మాట చెబుతున్నాను. మా స్పిన్నర్లు కొన్ని పొరపాట్లు చేశారు.
అక్కడే పట్టు కోల్పోయాం..
అయితే బ్యాటింగ్ సమయంలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం. కేవలం రెండు-మూడు ఓవర్ల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయాం. అక్కడే మ్యాచ్ పోయింది. మా బ్యాటింగ్ వైఫల్యం గురించి మేం ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాగే జరిగింది. మేం బాగానే ఆరంభించాం. కానీ హఠాత్తుగా వికెట్లు కోల్పోయాం.

దీన్ని ఏదో సంక్లిష్టమైన పద్ధతుల్లో పరిష్కరించలేం. అశుతోష్, నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. మేం అక్కడ పొరపాటు చేస్తే తర్వాత వచ్చే బ్యాటర్‌కు పరిస్థితి చాలా కష్టమవుతుందని అనుకున్నాం. కాబట్టి ఇది సరైన ఆలోచనా విధానంతో ఆడటంపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, రెండు వికెట్లు పడినా.. క్రీజులో సమయం గడుపుతూ ఆ ఒత్తిడిని అధిగమించవచ్చు. వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు.. ఒకటి, రెండు ఓవర్ల పాటు ఆ ఒత్తిడిని తట్టుకోవడమే మేం చేయాల్సింది.
వచ్చే ఏడాది కోసం..
ప్రస్తుతానికి మేం మా తప్పుల గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత.. ఎలాగో సుదీర్ఘ ప్రయాణం ఉంది. వచ్చే ఏడాది కోసం ఎలాంటి ప్రణాళికలు వేయాలి, ఎలాంటి దృక్పథంతో వెళ్లాలి అనే దాని గురించి ఆలోచిస్తాం. దాని ఆధారంగా బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లలో ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎలాంటి మార్పులు చేయాలి అనే అంశాలను కూడా పరిశీలిస్తాం.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఫిన్ అలెన్ ఊచకోత..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), అషుతోష్ శర్మ(28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసి 34 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఫిన్ అలెన్(47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో సత్తా చాటగా.. కామెరూన్ గ్రీన్(27 బంతుల్లో 2 సిక్స్‌లతో 33 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్‌కు మాత్రమే ఒక వికెట్ దక్కింది. ఫిన్ అలెన్ విన్నింగ్ షాట్‌గా సిక్సర్‌ను బాదడంతో పాటు సెంచరీ మార్క్ అందుకున్నాడు. 10 సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

