IPL 2026: కొంపముంచిన మార్కస్ స్టోయినీస్.. ఢిల్లీ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైంది. సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దూకుడు కనబర్చిన పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా చతికిలపడింది. చెత్త ఫీల్డింగ్‌తో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది.
210 సరిపోలేదు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య(33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించారు.
కూపర్ కానోల్లీ(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యన్ష్ షెద్గే(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్..
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు చేసి గెలుపొందింది. అక్షర్ పటేల్(30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), డేవిడ్ మిల్లర్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించారు.
మధవ్ తివారి(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 18 నాటౌట్), అషుతోష్ శర్మ(10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సిగ్, యశ్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. బెన్ ద్వార్షాయిస్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ పడగొట్టారు.
కొంపముంచిన మార్కస్ స్టోయినీస్..
211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ కూడా త్వరగానే వెనుదిరిగినా.. అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో ఢిల్లీని ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అనంతరం ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది.
17వ ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 6 వికెట్లకు 175 పరుగులే చేసింది. ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 36 పరుగుల అవసరయ్యాయి. కానీ మార్కస్ స్టోయినీస్ 18వ ఓవర్‌లో 19 పరుగులు ఇచ్చి పంజాబ్ విజయవకాశాలను దెబ్బతీసాడు. ఈ ఓవర్‌ను కాస్త కట్టడిగా వేసి ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications