Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: అనామక ప్లేయర్‌గా విజయ్ శంకర్.. ఎందుకంటే?

ఐపీఎల్ 2026 మినీ వేలంలో టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్, తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్ అనామక ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడిన విజయ్ శంకర్‌ను అనామక ఆటగాళ్ల జాబితాలో చేర్చడం తీవ్ర చర్చనీయాంశమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి మొత్తం 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజీలతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత బీసీసీఐ ఈ జాబితాను 350 మందికే పరిమితం చేసింది. అయితే ఈ జాబితాలో విజయ్ శంకర్‌ను అనామక ప్లేయర్ల జాబితాలో చేర్చడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు తీసుకొచ్చిన కొత్త రూల్ కారణంగా విజయ్ శంకర్ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల జాబితాలో చేర్చాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వరుసగా ఐదేళ్లు దూరంగా ఉండి, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లేని భారత అంతర్జాతీయ ఆటగాళ్లను అన్‌క్యాప్డ్‌గా పరిగణించాలని బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రూల్ ప్రకారం గత మెగా సీజన్‌కు ముందు మహేంద్ర సింగ్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ అనామక ఆటగాడిగా రూ.4 కోట్లకే రిటైన్ చేసుకుంది. ధోనీ కోసమే ఈ కొత్త రూల్ తెచ్చారని అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సందీప్ శర్మను కూడా రాజస్థాన్ అన్ క్యాప్డ్‌గా ప్లేయర్‌‌గా రూ.4 కోట్లకే రిటైన్ చేసుకుంది.

అనామక ప్లేయర్‌గా బరిలోకి దిగినా.. విజయ్ శంకర్‌ అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున శంకర్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు 30, ఒకసారి హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. రూ.30 లక్షల కనీస ధరతో ఉన్న విజయ్ శంకర్‌ను బ్యాకప్ ప్లేయర్ కోసం ఏదైనా ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. అతని అనుభవంతో పాటు బ్యాకప్‌గా పనికొస్తాడని భావిస్తేనే విజయ్ శంకర్ అమ్ముడుపోనున్నాడు. లేదంటే అన్‌సోల్డ్‌గా మిగిలిపోతాడు.4 ఏళ్ల శంకర్ వేలం ఏడో సెట్‌లో కమలేష్ నాగర్‌కోటి, తనుష్ కొటియన్, ఆకిబ్ నబీ, మహిపాల్ లోమ్రార్, ప్రశాంత్ వీర్ ఆటగాళ్లతో ఉన్నాడు. విజయ్ శంకర్‌కు అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటేనే ఫ్రాంచైజీలు అతన్ని కొనుగోలు చేయగలవు.

Story first published: Tuesday, December 9, 2025, 21:48 [IST]
Other articles published on Dec 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+