For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Prashant Veer: ఎవడ్రా వీడు.. రూ.14.20 కోట్లు పలికాడు!

'ప్రశాంత్ వీర్'.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఈ కుర్రాడు ఏకంగా రూ. 14.20 కోట్ల రికార్డ్ ధర పలికి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈ 20 ఏళ్ల కుర్రాడు రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటాపోటీగా బిడ్ వేసాయి.

చివరకు సీఎస్‌కే రూ.14.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా ఓ అనామక ఆటగాడి కోసం సీఎస్‌కే కోట్లు కుమ్మరించడంతో ప్రశాంత్ వీర్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన 'అన్‌క్యాప్డ్' ప్లేయర్‌గా కార్తీక్ శర్మతో కలిసి ప్రశాంత్ వీర్ రికార్డు సృష్టించాడు. ఈ కుర్రాడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.

ప్రశాంత్ వీర్ ఎవరంటే..?

ప్రశాంత్ వీర్ పూర్తి పేరు ప్రశాంత్ రామేంద్ర వీర్. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో 2005, నవంబర్ 24న జన్మించాడు. ప్రశాంత్‌ వీర్‌ది దిగువ మధ్యతరగతి కుటుంబం. అతని తండ్రి 'శిక్షా మిత్ర'(గ్రామీణ ప్రాంతాల్లో టీచర్‌)గా పని చేస్తున్నారు. తల్లి గృహిణి. ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్, కుడిచేతి వాటం బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ అతను. తన ఆట తీరు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పోలి ఉండటంతో ప్రశాంత్ వీర్‌ను జడేజా 2.o అని పిలుస్తారు.

IPL 2026 Auction Who Is Prashant Veer 20-Year-Old All-Rounder Signed by CSK for 14 2 Crore

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు రవీంద్ర జడేజా ట్రెడింగ్ ద్వారా రాజస్తాన్ రాయల్స్‌కు వెళ్లి పోవడంతో అతని స్థానాన్ని ప్రశాంత్ వీర్‌తో భర్తీ చేయాలని సీఎస్‌కే భావించింది. వేలానికి ముందే అతన్ని ట్రయల్స్‌కు ఆహ్వానించి పరీక్షించింది. జడేజా స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉందని గ్రహించిన సీఎస్‌కే మేనేజ్‌మెంట్ వేలంలో అతని కోసం దూకుడుగా బిడ్ వేసింది. ఆఖరి రూ.14.20 కోట్ల భారీ ధరకు చేజిక్కించుకుంది.

దేశవాళీ రికార్డ్స్..

ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే ప్రశాంత్ వీర్.. ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 7 రోజుల వ్యవధిలోనే 6 మ్యాచ్‌లు ఆడి 170 స్ట్రైక్‌రేట్‌తో 112 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 6.76 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20 లీగ్‌లో నోయిడా సూపర్ కింగ్స్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడి 320 పరుగులతో పాటు 8 వికెట్లు పడగొట్టాడు.

ఈ ప్రదర్శనే ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. యూపీ తరఫున అండర్ 23 క్రికెట్‌లోనూ ప్రశాంత్ వీర్ 50 ప్లస్ సగటుతో పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు పడగొట్టాడు. చివర్లో బ్యాటింగ్‌కు దిగి భారీ సిక్స్‌లు బాదడం ప్రశాంత్ వీర్ ప్రత్యేకత. ఈ సామర్థ్యాన్ని గ్రహించే ఈ కుర్రాడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

Story first published: Tuesday, December 16, 2025, 17:59 [IST]
Other articles published on Dec 16, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+