Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: 77 స్థానాల కోసం 1355 మంది పోటీ!

ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్దమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ మినీ ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా 10 జట్లలో 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 77 స్థానాల కోసం 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరతో 45 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు 10 జట్లకు అందించారు. పది ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేయనున్నాయి. డిసెంబర్ 5 నాటికి తమ షార్ట్ లిస్ట్ జాబితాను ఫ్రాంచైజీలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అందజేయాల్సి ఉంటుంది. 10 ఫ్రాంచైజీల షార్ట్ లిస్ట్ జాబితాల నుంచి నిర్వాహకులు తుది జాబితాను సిద్దం చేసి వేలం వేస్తారు.

ప్రతీ జట్టు గరిష్టంగా 25 మంది కనిష్టంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నాయి. ఈ 77 మందిలో విదేశీ ఆటగాళ్లకు 31 స్లాట్స్ ఉన్నాయి. ఈ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. గాయంతో అతను ఐపీఎల్ 2025 మెగా వేలానికి దూరంగా ఉన్నాడు. దాంతో ఈసారి అతనికి భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. రిటెన్షన్ ప్రక్రియ తర్వాత కేకేఆర్ జట్టుకు అత్యధిక పర్స్ వాల్యూ కలిగి ఉంది. ఆ జట్టు దగ్గర రూ.64.3 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.4 కోట్ల డబ్బులున్నాయి.

IPL 2026 Auction Full List of Players with 2 Crore Base Price Released

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్, సౌతాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌ 2026 టోర్నీకి దూరంగా ఉన్నారు. రస్సెల్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్‌గా అవతారమెత్తగా.. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఈసారి వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. పీఎస్‌ఎల్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పగా.. ఈ సీజన్‌కు దూరంగా ఉండాలని మ్యాక్స్‌వెల్ నిర్ణయించుకున్నాడు.

రూ.2 కోట్ల కనీస ధరతో ఉన్న ఆటగాళ్లు

రవిబిష్ణోయ్, వెంకటేశ్ అయ్యర్, ముజీబుర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, సీన్ అబాట్, అస్టన్ అగర్, కూపర్ కూనేలి, జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లీస్, స్టీవ్ స్మిత్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, లియామ్ లివింగ్ స్టోన్, టైమల్ మిల్స్, జెమీ స్మిత్, ఫిల్ అలెన్, మైకేల్ బ్రాస్ వెల్, డేవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, కైల్ జెమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, మిలియం ఓరూర్క్, రచిన్ రవీంద్ర, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోకియా, రిలీ రూసో, తబ్రైజ్ షంసి, డేవిడ్ వైస్, వానిందు హసరంగ, మతీశా పతిరన, మహీష్ తీక్షణ, జేసన్ హోల్డర్, షైయ్ హోప్, అకిల్ హోసెన్, అల్జారీ జోసెఫ్.

Story first published: Tuesday, December 2, 2025, 14:22 [IST]
Other articles published on Dec 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+