Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాప్‌రే.. గంటకు 154 కిలోమీటర్ల వేగం! చరిత్ర సృష్టించిన గుజరాత్ యువ పేసర్!

గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ అశోక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత వేగవంతమైన పేసర్‌గా నిలిచాడు. గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ ఫీట్ సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశోక్ శర్మ ఈ ఘనతను అందుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ సందర్భంగా 16వ ఓవర్ ఆఖరి బంతిని గంటకు 154 కిలోమీటర్ల వేగంతో సంధించాడు. ఈ వేగవంతమైన బాల్‌కు రాజస్థాన్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సమాధానం ఇవ్వలేకపోయాడు. జురెల్ బ్యాట్‌కు ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి అతని ప్యాడ్లకు తాకింది. ఇదే ఓవర్‌లో డేంజరస్ షిమ్రాన్ హెట్‌మైర్‌ను అశోక్ శర్మ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన అశోక్ శర్మ 37 పరుగులిచ్చి ఒక వికెట్ తీసాడు. ఈ నాలుగు ఓవర్లలో నిలకడగా గంటకు 140 ప్లస్ స్పీడ్‌తో బౌలింగ్ చేశాడు.

15 ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డు..

ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ ఆస్ట్రేలియా బౌలర్ షాన్ టైట్ పేరిట ఉంది. 2011లో గంటకు 157.71 కిలోమీటర్ల వేగంతో అతను విసిరిన బంతి ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలోఫాస్టెస్ట్ బాల్ రికార్డుగా కొనసాగుతోంది. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ అందుకున్నాడు. జమ్మూకశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్‌పై గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్‌గా నిలిచాడు.

IPL 2026 Ashok Sharma Creates History Clocks 154 Kph to Bowl the Fastest Ball of the Season So Far

ఎవరీ అశోక్ శర్మ

రాజస్థాన్‌లోని జైపూర్‌ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మ‌ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. అశోక్ శర్మ తండ్రి హుకమ్ చంద్ శర్మ.. రాజస్థాన్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కొడుకును క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కోరిక.

తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన అశోక్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడం అతని ప్రత్యేకత. కుడిచేతి వాటం పేసర్ అయిన అశోక్ శర్మ.. తనను తాను హార్డ్ లెంగ్త్ బౌలర్‌గా చెప్పుకుంటాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 19 వికెట్లతో అల్లాడించాడు. 12.10 సగటు, 8.84 ఎకానమీతో టాప్ బౌలర్‌గా నిలిచాడు.


IPL చరిత్రలో టాప్ 10 ఫాస్టెస్ట్ బంతులు (అధికారిక గణాంకాల ప్రకారం):

షాన్ టైట్ (రాజస్థాన్ రాయల్స్) - 157.71 vs ఢిల్లీ క్యాపిటల్స్ (2011)

ఉమ్రాన్ మాలిక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) - 157.00 vs ఢిల్లీ క్యాపిటల్స్ (2022)

మయాంక్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్) - 156.70 vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2024)

అన్రిచ్ నోర్కియా (ఢిల్లీ క్యాపిటల్స్) - 156.22 vs రాజస్థాన్ రాయల్స్ (2020)

ఉమ్రాన్ మాలిక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) - 156.00 vs ఢిల్లీ క్యాపిటల్స్ (2022)

మయాంక్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్) - 155.80 vs పంజాబ్ కింగ్స్ (2024)

అన్రిచ్ నోర్కియా (ఢిల్లీ క్యాపిటల్స్) - 155.10 vs రాజస్థాన్ రాయల్స్ (2020)

ఉమ్రాన్ మాలిక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) - 154.80 vs ఢిల్లీ క్యాపిటల్స్ (2022)

అన్రిచ్ నోర్కియా (ఢిల్లీ క్యాపిటల్స్) - 154.70 vs రాజస్థాన్ రాయల్స్ (2020)

డెయిల్ స్టెయిన్ (డెక్కన్ చార్జర్స్) - 154.40 vs ముంబై ఇండియన్స్ (2012)

Story first published: Saturday, April 4, 2026, 22:56 [IST]
Other articles published on Apr 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+