Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్..! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో 13 మ్యాచ్‌ల నిరీక్షణ తర్వాత ఆఖరి మ్యాచ్‌లో అవకాశం అందుకున్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు నిరాశే ఎదురైంది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ ఎట్టకేలకు అవకాశం అందుకున్నాడు.

రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్జున్ భావించినా అతన్ని దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ టెండూల్కర్‌కు కేవలం ఐదు బంతులు ఆడే అవకాశం దక్కింది. ఈ ఐదు బంతుల్లో అర్జున్ ఐదు పరుగులే చేయడంతో ఆఖరి ఓవర్‌లో అతనికి స్ట్రైక్ ఇచ్చేందుకు అబ్దుల్ సమద్ నిరాకరించాడు.

స్ట్రైక్ ఇవ్వని సమద్..

అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్‌లో అబ్దుల్ సమద్ వరుసగా మూడు బంతుల్లో సింగిల్ తీసే అవకాశం ఉన్నా తీయలేదు. స్ట్రైక్ ఇవ్వండి బ్రో అని అర్జున్ అడుక్కున్నా.. అతను కనుకరించలేదు. చివరి మూడు బంతుల్లో అబ్దుల్ సమద్ 6, 4, 4 బాది జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

IPL 2026 Arjun Tendulkar Frustrate Skipper Rishabh Pant Drops Prabhsimran Singh on LSG Debut
Photo Credit: X (twitter)

ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అర్జున్ టెండూల్కర్‌కు కలిసి రాలేదు. పవర్ ప్లే ముగిసిన వెంటనే రిషభ్ పంత్.. అర్జున్ టెండూల్కర్‌కు బంతిని అందించాడు. బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన అర్జున్ బౌలింగ్‌లో నిప్పులు చెరిగాడు. తాను వేసి 7వ ఓవర్‌లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో పాటు శ్రేయస్ అయ్యర్‌ను అర్జున్ ఇబ్బంది పెట్టాడు.

క్యాచ్ వదిలేసిన పంత్..

ఈ ఓవర్‌ నాలుగో బంతికి ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను రిషభ్ పంత్ నేలపాలు చేశాడు. దాంతో వికెట్ తీసే అవకాశాన్ని అర్జున్ కోల్పోయాడు. తన రెండో ఓవర్‌లో మాత్రం అర్జున్ తేలిపోయాడు. రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 15 పరుగులు సమర్పించుకున్నాడు. రిషభ్ పంత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే అర్జున్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యేదని, మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసేవాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

రిషభ్ పంత్ ఇచ్చిన అవకాశంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చెలరేగాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. మూడో వికెట్‌కు 140 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అయితే తన మూడో ఓవర్‌లో అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన యార్కర్‌తో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను పెవిలియన్ చేర్చాడు.

Story first published: Saturday, May 23, 2026, 22:58 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+