ఆ తెలుగు హీరోయిన్‌తో తిలక్ వర్మ డేటింగ్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలతో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ధర్మశాల వేదికగా మే 14న జరిగిన మ్యాచ్‌కు శ్రీలీల కుటుంబ సభ్యులతో హాజరైందని, తిలక్ వర్మ కోసమే మ్యాచ్‌కు వచ్చిందని కొందరు నెటిజన్లు ఎక్స్‌వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారని కూడా జోస్యం చెబుతున్నారు. గతేడాది నుంచి ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పేర్కొంటున్నారు. అయితే ఈ వార్తలపై తిలక్ వర్మ, శ్రీలీల అధికారికంగా స్పందించలేదు. ఈ వార్తలను కొట్టిపారేయలేదు. తిలక్ వర్మ అభిమానులు మాత్రం ఇది ఫేక్ న్యూస్ అని కామెంట్ చేస్తున్నారు. తమ సోషల్ మీడియా పోస్ట్‌ల రిచ్ కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరిచయం కాస్త ప్రేమగా..
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా శ్రీలీల కొనసాగుతోంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలల అనతి కాలంలోనే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తన అందంతో పాటు అభినయంతో టాప్ హీరోల సరసన నటించే అవకాశం అందుకున్న ఈ అమ్మడు.. వరుస సక్సెస్‌లతో బిజీగా ఉంది. ఆంధ్రపద్రేశ్‌లోని ఒంగోలు ప్రాంతంలో శ్రీలీల జన్మించగా.. వారి ఫ్యామిలీ కర్ణాటకలో సెటిల్ అయ్యింది.

మ్యూచవల్ ఫ్రెండ్ ద్వారా శ్రీలీలతో తిలక్ వర్మకు అయిన పరిచయం ప్రేమకు దారితీసిందని, గతేడాదిగా ఈ ఇద్దరూ సీక్రెట్‌గా లవ్ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తిలక్ వర్మ మాములోడు కాదని, కత్తిలాంటి హీరోయిన్‌ను పడేసాడని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ బ్యూటీని తిలక్ ఎలా పడేసాడా? అని చర్చించుకుంటున్నారు. అయితే నెటిజన్లు చెబుతున్నట్లు శ్రీలీల ధర్మశాల మ్యాచ్‌కు హాజరైనట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఇవి కేవలం పుకార్లనే విషయం స్పష్టమవుతోంది.
ఆ నల్లోడే గెలిపించాడు..
తిలక్ వర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) ఒంటి చేత్తో ముంబైని గెలిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నల్లోడా అని వెక్కిరించినా.. తిలక్ తన ఆటతో దిమ్మతిరిగే బదులిచ్చాడు. ముంబై ఇండియన్స్ అయితే తిలక్ వర్మ మా చంద్రుడు అంటూ అర్ష్‌దీప్ సింగ్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

