IPL 2026: పాపం.. ఈ ఆరుగురి ఆటగాళ్లకు తగిన గుర్తింపు లేదు!
ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా.. కొందరి ఆటగాళ్లకు తగిన గుర్తింపు లభించడం లేదు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా.. ఆ ఆటగాళ్ల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అయినా వారు తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
1. ప్రిన్స్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్)
ప్రిన్స్ యాదవ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యుత్తమ భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. అయినా అతనికి రావాల్సిన గుర్తింపు దక్కలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న ప్రిన్స్ యాదవ్ 9 మ్యాచ్‌ల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కనబర్చినా.. ప్రిన్స్ యాదవ్ నిలకడగా రాణించాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఈ యువ పేసర్‌కు తగిన అనుభవం లేకున్నా వేగం, సీమ్ మూవ్‌మెంట్‌తో వికెట్లు రాబట్టాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణిస్తూ నిలకడగా వికెట్లు తీస్తున్నాడు.
2. ఈషన్ మలింగా (సన్‌రైజర్స్ హైదరాబాద్)
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఈషన్ మలింగా ఐపీఎల్ 2026లో అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌లలో ఒకరిగా నిలిచాడు. ఈ శ్రీలంక పేసర్ 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కానీ అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో సత్తా చాటుతుండటంతో ఈషన్ మలింగాకు తగిన గుర్తింపు లభించడం లేదు.

3. అన్షుల్ కంబోజ్ (చెన్నై సూపర్ కింగ్స్)
ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అనామక బౌలర్‌గా అన్షుల్ కంబోజ్ నిలిచాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తడబడినప్పటికీ.. కంబోజ్ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు. హర్యానాకు చెందిన ఈ యువ ఫాస్ట్ బౌలర్ 10 మ్యాచ్‌ల్లో 17 వికెట్లతో ఈ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్లలో ఒకడిగా నిలిచాడు.
4. డోనావన్ ఫెరీరా (రాజస్థాన్ రాయల్స్)
రాజస్థాన్ రాయల్స్‌లో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్‌లపైనే అందరి దృష్టి మళ్లింది. కానీ డోనావన్ ఫెరీరా ఐపీఎల్ 2026లో అత్యంత ప్రమాదకరమైన ఫినిషర్‌లలో ఒకరిగా నిలిచాడు. సీజన్ అంతటా పరిమిత అవకాశాలు లభించినప్పటికీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం 14 బంతుల్లోనే అజేయంగా 47 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇన్నింగ్స్ చివర్లో రాజస్థాన్ రాయల్స్‌కు అవసరమైనప్పుడల్లా.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు.
5. పాథుమ్ నిస్సంక (ఢిల్లీ క్యాపిటల్స్)
పాథుమ్ నిస్సంక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున దుమ్మురేపుతున్నాడు. కేఎల్ రాహుల్ ప్రదర్శన ఒక్కటే చర్చనీయాంశమవుతుండగా.. పాథుమ్ నిస్సంక పరుగులను ఎవరూ పట్టించుకోవడం లేదు. టాప్ ఆర్డర్‌లో నిస్సంక సత్తా చాటుతున్నాడు. అయితే ఈ శ్రీలంక ఓపెనర్.. నిలకడగా రాణిస్తున్నా తగిన గుర్తింపు లభించడం లేదు.
6. కూపర్ కానొలీ (పంజాబ్ కింగ్స్)
ఈ సీజన్‌లో తక్కువ అంచనా వేయబడిన విదేశీ ఆటగాళ్ళందరిలో కూపర్ కానోలి అగ్రస్థానంలో నిలుస్తాడు. ఈ పంజాబ్ బ్యాటర్.. ఆరంభంలో వికెట్లు కోల్పోయిన తర్వాత పంజాబ్ కింగ్స్‌ను ాదుకుంటున్నాడు. సైలెంట్‌గా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications