Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కావ్య మారన్‌కు బిగ్ షాక్.. SRH vs RCB మ్యాచ్ బాయ్‌కాట్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఫ్యాన్స్ పిలుపునిస్తున్నారు. ఈ మ్యాచ్ టికెట్లను రెట్టింపు ధరలకు అమ్మడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 22న ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కాగా.. ఉప్పల్ వేదికగా జరిగే ఆఖరి ఐపీఎల్ గేమ్ కూడా ఇదే. అంతేకాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోహ్లీ క్రేజ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సొమ్ము చేసుకుంది.

IPL 2026 Angry Fans Call for Boycott of SRH vs RCB Match Over Exorbitant Ticket Prices

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్లో టికెట్ల విక్రయాలు ప్రారంభించగా.. అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. టికెట్ల బుకింగ్ యాప్‌లో దాదాపు 4 లక్షల మంది క్యూలైన్లో వేచి ఉండటం గమనార్హం. నిజానికి ఉప్పల్‌ స్టేడియం మొత్తం సామర్థ్యం కేవలం 39,000 మాత్రమే. ఇందులో కాంప్లిమెంటరీ టికెట్లు పోగా.. అందుబాటులో ఉన్న సీట్ల కంటే ఎన్నో రెట్లు అదనంగా అభిమానులు టికెట్ల కోసం పోటీ పడ్డారు. అయితే లోపలికి వెళ్లి టికెట్ ధరలను చూసిన సగటు క్రికెట్ ప్రేమికుడికి తీవ్ర నిరాశే ఎదురైంది. మునుపటి మ్యాచ్‌లతో పోలిస్తే కొన్ని కేటగిరిల్లోని టికెట్లను 50 నుంచి 100 శాతం పెంచేసారు.

IPL 2026 Angry Fans Call for Boycott of SRH vs RCB Match Over Exorbitant Ticket Prices

రూ. 950 టికెట్ రూ.2000, రూ.1500 ఉన్న టికెట్ రూ. 3000, రూ.1910 ఉన్న టికెట్ రూ. 3500, రూ.2500 ఉన్న టికెట్ రూ. 4500, రూ.4500 ఉన్న టికెట్ రూ. 6000, రూ.7000 ఉన్న టికెట్ ధర రూ.10 వేలు, రూ. 23 వేలు ఉన్న బాక్స్ టికెట్ ధర రూ. 30 వేల రూపాయలకు, రూ.30 వేలు ఉన్న కార్పోరేట్ బాక్స్ టికెట్ ధర రూ. 45 వేలకు పెంచేసారు. విరాట్ కోహ్లీ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా సాధారణ అభిమానులకు దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులంతా కలిసి ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఎవరూ స్టేడియాలకు వెళ్లకుండా టీవీల్లో మ్యాచ్‌లు చూడాలని కోరుతున్నారు. కావ్య మారన్ అన్యాయంగా అభిమానులను దోచుకుంటుందని మండిపడుతున్నారు. కనీసం వచ్చే సీజన్‌లోనైనా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి బుద్ది చెప్పాలను కోరుతున్నారు.

Story first published: Monday, May 18, 2026, 13:13 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+