అమ్మో వైభవ్.. జైస్వాల్ వెంటనే రాజస్థాన్‌ను వీడాలి: అంబటి రాయుడు
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వెంటనే ఆ జట్టును వీడాలని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సూచించాడు. వైభవ్ సూర్యవంశీ నీడలో యశస్వి జైస్వాల్ కొనసాగడం అతని కెరీర్‌కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. వీలైనంత త్వరగా జట్టు మారాలని హితవు పలికాడు.
యశస్వి జైస్వాల్ 2020 నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 82 మ్యాచ్‌ల్లో 2592 పరుగులు చేశాడు. అయితే ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 15 మ్యాచ్‌ల్లో 680 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా..జైస్వాల్ 15 మ్యాచ్‌ల్లో 426 పరుగులు చేసాడు. నిలకడకు మారుపేరైన యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో మాత్రం నిలకడగా రాణించలేకపోయాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో జైస్వాల్ తీవ్రంగా తడబడ్డాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 29 బంతుల్లో 29 పరుగులే చేయగా.. సూర్యవంశీ 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. ఓవైపు వైభవ్ చెలరేగుతుండటంతో జైస్వాల్ స్ట్రైక్‌రొటేట్ చేశాడు.

అయితే ఇలా వైభవ్ సూర్యవంశీ నీడన ఉండటం జైస్వాల్ కెరీర్‌కే ప్రమాదమని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో షోలో మాట్లాడిన రాయుడు.. జైస్వాల్ వీలైనంత త్వరగా రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలని అభిప్రాయపడ్డాడు.
'యశస్వి జైస్వాల్ జట్టును మార్చుకోవాలి. అతను సూర్యవంశీతో కలిసి బ్యాటింగ్ చేస్తూ ప్రతిసారీ డామినేట్ చేయలేడు. అతను స్వతహాగా ఒక స్టార్. ఇంకో టీమ్‌కు వెళ్తే.. సొంతంగా మ్యాచ్‌లు గెలిపిస్తాడు. అతనికి ఆ అవకాశం, వేదిక అవసరం.
సూర్యవంశీ ఇతరులను ఎల్లప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి, సూర్యవంశీ పక్కన అతనితో పోటీపడని, అతని విజయాలను ఆనందించే సీనియర్ భాగస్వామి అవసరం’అని రాయుడు వివరించాడు. ఈ మార్పు జైస్వాల్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని జోస్యం చెప్పాడు.
యశస్వి జైస్వాల్ వేలంలోకి వస్తే అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతాయని, ముంబై ఇండియన్స్ అతనికి సరైన ఎంపిక అని రాయుడు అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉందని, ముంబైలో జైస్వాల్ తనదైన స్థానం ఏర్పరచుకుని పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించవచ్చన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications