Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓడినా.. గర్వంగా ఉంది: అజింక్యా రహానే

ఐపీఎల్ 2026 సీజన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఓటమితో ముగించింది. కోల్‌కతా వేదికగా ఆదివారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)ను చిత్తు చేసింది. అయితే ఈ సీజన్‌ను ఓటమితో ముగించినా తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన రహానే.. క్లిష్ట పరిస్థితుల నుంచి తమ జట్టు అద్భుతంగా పుంజుకుందని, ఆఖరి మ్యాచ్ వరకు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుందని తెలిపాడు. తన వ్యక్తిగత ప్రదర్శనపై కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు.

IPL 2026 Ajinkya Rahane Reveals His Immediate Post-IPL Plans After KKR s Heartbreaking Exit
Photo Credit: screen grab for JioHotstar

'నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నాను. నా వంతుగా అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాను. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా.. ఈ సీజన్‌లో మేం ఆడిన విధానం చూసి ఎంతో గర్వపడుతున్నాను. మేం ఉన్న క్లిష్ట పరిస్థితి నుంచి.. లీగ్‌లో మా అవకాశాలను చివరి వరకు సజీవంగా ఉంచిన తీరు అద్భుతం.

మైదానంలోకి వెళ్లి ప్రతి ఒక్కరూ పెట్టిన శ్రమ చూస్తే నాకు గర్వంగా అనిపిస్తోంది. అయితే, మేం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం చాలా నిరాశ కలిగించింది. ప్రస్తుతానికి, ఆటగాళ్లకు వారి ఇతర వ్యక్తిగత ప్రణాళికలు, కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మేమంతా ఫోన్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి దీనిపై చర్చలు జరుపుతాం. నా విషయానికి వస్తే.. కేవలం ఒక రెండు రోజులు విరామం తీసుకుంటాను. ఆ తర్వాత ముంబైలో జరిగే మా లోకల్ లీగ్ మ్యాచ్‌లు ఆడటానికి వెళ్తాను.'అని అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు.

ఈ టోర్నీలో తొలి 6 మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఒక్క మ్యాచ్ గెలవలేదు. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. తదుపరి 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. ఓవరాల్‌గా 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్‌ సాధించి పాయింట్స్ టేబుల్‌లో 7వ స్థానంతో నిలిచింది.

Story first published: Monday, May 25, 2026, 0:14 [IST]
Other articles published on May 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+