KKR vs SRH: వారి వైఫల్యమే మా ఓటమికి కారణం: అజింక్యా రహానే
మిడిలార్డర్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. రెండు పెద్ద భాగస్వామ్యాలు నమోదై ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రహానే.. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిందని చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు స్లోయర్ బాల్స్‌తో తమ పతనాన్ని శాసించారని కొనియాడాడు.
ఆ రనౌట్ మా కొంపముంచింది..
'మరో రెండు పెద్ద భాగస్వామ్యాలు నమోదై ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎప్పుడైనా క్రీజులో సెట్ అయిన బ్యాటర్లను ఆటను ఆఖరి వరకు తీసుకెళ్లాలి. బౌలింగ్‌లో ఆరంభంలో విఫలమైనా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. తొలి 10 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 130, 140 పరుగులు చేసేలా కనిపించింది. కానీ మా బౌలర్లు అద్భుతంగా పుంజుకొని కట్టడి చేశారు. భారీ లక్ష్య ఛేదనలో భాగస్వామ్యాలు చాలా కీలకం. కానీ మేం వాటిని నిర్మించలేకపోయాం.
పిచ్‌పై గడ్డి ఉండటం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో బంతి కొంచెం ఆగి వచ్చినట్లు అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌తో పోల్చితే స్లోయర్ బాల్స్ బాగా గ్రిప్ అయ్యాయి. వికెట్ మెరుగుపడుతుందని మేం భావించాం. కానీ బంతి మరింత ఆగుతూ వచ్చింది. అయితే ఇవన్నీ మా ఓటమికి సాకులు కావు. మాకు మెరుగైన ఆరంభం లభించింది. తొలి 6 ఓవర్లలో మేం 78 పరుగులు చేశాం. కానీ గ్రీన్ రనౌట్ అవ్వడం వల్ల ఎక్స్‌ట్రా వికెట్ కోల్పోయాం. అది తప్ప.. మేం బాగానే ఆడాం.

మా కాంబినేషన్ రీసెట్ చేయాలి..
నేను చెప్పినట్లుగా మిడిల్ ఓవర్లే మాకు చాలా కీలకం. క్రీజులో ఉన్న బ్యాటర్ల నుంచి భాగస్వామ్యం అవసరమైంది. కానీ అది జరగలేదు. సన్‌రైజర్స్ బౌలర్లు స్లోయర్ బంతులతో బోల్తా కొట్టించారు. వారి బౌలింగ్ ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. కచ్చితంగా.. హోమ్ గేమ్ గెలవడం చాలా ముఖ్యం. మేం మళ్ళీ డ్రాయింగ్ రూమ్‌కి వెళ్లి మా కాంబినేషన్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మార్పులు, బ్యాటింగ్ లైనప్‌లో అదనపు బ్యాటర్‌ను చేర్చుకోవాలా అనే దానిపై చర్చించాలి.
తదుపరి మ్యాచ్‌కు మాకు 3-4 రోజుల సమయం ఉంది. మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. ఆటగాళ్లు బాగానే రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో మాకు కలిసి రాని రోజు మాత్రమే. గత మ్యాచ్‌లో మేం అద్భుతంగా ఆడాం. కేవలం చిన్న చిన్న భాగస్వామ్యాలు అవసరమయ్యాయి. బ్యాటర్లు సానుకూల దృక్పథంతో, బ్యాటింగ్ చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉంటే అంతా సర్దుకుంటుందని నేను భావిస్తున్నా.'అని రహానే చెప్పుకొచ్చాడు.
SRH బ్యాటర్ల విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రీచ్ క్లాసెన్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) దూకుడుగా ఆడారు. నితీష్ కుమార్ రెడ్డి(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39) పర్వాలేదనిపించాడు.
అనంతరం కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించినా.. రింకూ సింగ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35), ఫిన్ అలెన్(7 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/21) మూడు వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగా(2/14), నితీష్ కుమార్ రెడ్డి(2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్ష్‌దూబేకు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications