IPL 2026: పులికి ఢిల్లీ బలి.. ఉప్పల్‌లో SRH హ్యాట్రిక్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌లోనూ ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది. మంగళవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగితే.. బౌలింగ్‌లో ఎషాన్ మలింగా(4/32) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), ఇషాన్ కిషన్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), హెన్రీచ్ క్లాసెన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నితీష్ రాణా(30 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37), సమీర్ రిజ్వీ(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఎషాన్ మలింగా నాలుగు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే(3/12) మూడు వికెట్లు పడగొట్టాడు. దిల్షాన్ మదుషంక, సకీబ్ హుస్సేన్ తలో వికెట్ తీసారు.
పులికి ఢిల్లీ బలి..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మూడో పరాజయం. 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ఆరెంజ్ ఆర్మీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ముద్దుగా పులి అని పిలుచుకునే అభిషేక్ అజేయ శతకంతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు.
20 ఓవర్ల పాటు క్రీజులో ఉండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 242 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై భారీ స్కోర్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్ మధ్య దూకుడుగా ఆడాలనే ఆరాటంతో వరుసగా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications