Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడిని టెస్ట్ టీమ్‌లోకి తీసుకోండి.. ప్రత్యర్థి జట్లు వణికిపోతాయి: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని టెస్ట్ టీమ్‌లోకి తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ సూచించాడు. అతను సుదీర్ఘ ఫార్మాట్‌లో బరిలోకి దిగితే ప్రత్యర్థి జట్లు భయంతో గడగడలాడతాయని తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ 15 ఏళ్ల కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. తన అద్వితీయమైన బ్యాటింగ్‌తో వరల్డ్‌‌క్లాస్ బౌలర్లను సైతం తలదించుకునేలా చేస్తున్నాడు. అతని అసాధారణ ప్రతిభకు ఆశ్చరపోయిన ఆరోన్ ఫించ్.. వైభవ్ ఫియర్‌లెస్ గేమ్ తనను అబ్బూరపరుస్తుందని కొనియాడాడు.

టెస్ట్ క్రికెట్‌ను ఏలుతాడు..

టెస్ట్ క్రికెట్‌‌కు దూకుడు పరిచయం చేసిన వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్ల తరహాలోనే వైభవ్ సూర్యవంశీ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌పై తీవ్ర ప్రభావం చూపుతాడని ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు.

'టీ20 ఫార్మాట్‌లో వైభవ్ సూర్యవంశీ కొత్త బంతిని ఎంత సులువుగా.. ఎలాంటి భయం లేకుండా ఎదుర్కొంటున్నాడో మనం గమనించాం. అతన్ని భారత టెస్ట్ జట్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపితే.. 50 ఓవర్ల తర్వాత పాత బంతిని ఎంత నిర్దయగా చితకబాదుతాడో ఒక్కసారి ఊహించండి.

IPL 2026 Aaron Finch Claims Vaibhav Suryavanshi s Batting Fearless Enough to Scaring Test Teams

పంత్‌ను తలపిస్తోంది..

రిషభ్ పంత్ తన ఫియర్‌లెస్ గేమ్‌తో అనూహ్యమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఎలా చితక్కొడుతాడో.. అలాంటి మొరటు నైపుణ్యం వైభవ్ సూర్యవంశీలో కూడా సహజంగా ఉంది. 15 ఏళ్ల ఈ యువ బ్యాటర్ ఆటతీరు పంత్ దూకుడును గుర్తుచేస్తుంది.

కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి వేగవంతమైన బౌలర్లు బరిలోకి దిగినా.. తొలి బంతి నుంచే ఎలాంటి బెరుకు లేకుండా బౌండరీలు, సిక్సర్లు బాదే అతని సామర్థ్యం నన్ను నిజంగా అబ్బురపరుస్తోంది. 15 ఏళ్ల కుర్రాడిలో ఇంతటి పరిణతి చెందిన ఆటను చూడటం నమ్మశక్యం కాని విషయం.’అని ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు.

10 మ్యాచ్‌లు.. 404 పరుగులు..

ఢిల్లీ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కైల్ జెమీసన్ 4 పరుగులకే ఔటైనప్పటికీ.. ఈ సీజన్‌లో వైభవ్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి.. 40.40 సగటుతో, 237.64 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో మొత్తం 404 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాడు.

వైభవ్ సూర్యవంశీ ప్రదర్శిస్తున్న ఈ అసాధారణమైన ఆటకు క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఫిదా అవుతున్నారు. వచ్చే నెల ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో అతనికి తప్పకుండా భారత జట్టులో అరంగేట్రం అవకాశం కల్పించాలని బీసీసీఐకి సూచిస్తున్నారు.

Story first published: Saturday, May 2, 2026, 13:59 [IST]
Other articles published on May 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+