అప్పుడు టీమిండియాను ఇప్పుడు గుజరాత్‌ను ముంచేసాడు: ఆకాశ్ చోప్రా
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. గిల్ వైఫల్యం కారణంగానే గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవలేకపోయిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌గా నిలిచింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. కీలకమైన ఫైనల్లో గుజరాత్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ మినహా మరే బ్యాటర్ రాణించలేకపోయాడు.
ప్రపంచకప్ ఫైనల్ తరహాలో..
ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. శుభ్‌మన్ గిల్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడని తెలిపాడు. అతను ఔటైన తీరు చూస్తే తనకు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గుర్తొచ్చిందని చెప్పాడు.

'గుజరాత్ టైటాన్స్ ఆట ఆరంభించిన విధానం.. ఆపై శుభ్‌మన్ గిల్ వికెట్ పడిన తీరు చూశాక.. వారు నిలదొక్కుకుంటారని నేను అనుకోలేదు. నిజానికి అది వికెట్ పడే బంతి ఎంతమాత్రం కాదు. అంతకుముందు బంతికే గిల్ ఫోర్ కొట్టాడు. కానీ, ఆ తర్వాతి బంతికే పెద్ద షాట్‌కు ప్రయత్నిస్తూ ఔట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్‌కు ఈ సీజన్ అద్భుతంగా సాగింది. తన బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కానీ కీలకమైన ఫైనల్లో చేతులెత్తేసాడు.
ఆర్‌సీబీ ప్లానింగ్‌కు మొక్కాల్సిందే..
శుభ్‌మన్ గిల్ ఔట్ అయిన తీరు చూస్తే నాకు వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ గుర్తుకొస్తోంది. అది చాలా సాధారణమైన షాట్. అతను అంతకుముందు మ్యాచ్‌లో సెంచరీ కొట్టి ఈ మ్యాచ్‌లోకి వచ్చాడు. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి.
సాయి సుదర్శన్ ఒక షార్ట్ బాల్‌కు ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్లానింగ్‌కు రెండు చేతులెక్కి మొక్కాల్సిందే. ఈ పిచ్‌పై స్వింగ్ లభించలేదు. అందుకే బౌలర్లందరూ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ వేశారు. ప్రతి ఒక్కరూ హాఫ్-ట్రాకర్లు వేయడానికి ప్రయత్నించారు. దానికి తగ్గట్టుగా ఫీల్డర్లను సరైన స్థానాల్లో ఉంచారు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ ఇచ్చిన క్యాచ్‌ను జోర్డాన్ కాక్స్ పట్టుకుని ఉంటే.. ఈ జట్టు కనీసం 150 పరుగులు కూడా చేసి ఉండేది కాదు.
గుజరాత్ బలహీనతే..
గుజరాత్ టైటాన్స్ ప్రధాన బలహీనత ఏంటంటే.. ఆ జట్టు పూర్తిగా టాప్-3 బ్యాటర్లపై అమితంగా ఆధారపడింది. జోస్ బట్లర్ కూడా ఔట్ అయితే ఇక మ్యాచ్ ముగిసిపోతుందని భయపడి, నంబర్ 4 స్థానంలోకి మార్చారు. వాషింగ్టన్ సుందర్ బాగానే ఆడాడు. అతను ఈ సీజన్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ఒక రకంగా అవి కీలకమైన ఇన్నింగ్స్‌లే, కానీ జట్టు బలహీనత మాత్రం స్పష్టంగా బయటపడింది.'అని ఆకాష్ చోప్రా విశ్లేషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications