For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ఆ ఐదుగురు ఔట్.. SRH వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) తీవ్రంగా నిరాశపర్చింది. డిఫెండింగ్ రన్నరప్‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. తమకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ సీజన్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్.. అనూహ్యంగా వరుస పరాజయాలతో చతికిలపడింది. చివర్లో పుంజుకొని హ్యాట్రిక్ విజయంతో ఈ సీజన్‌ను ముగించింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 గెలవడంతో పాటు ఓ మ్యాచ్ రద్దవ్వడంతో 13 పాయింట్స్ సొంతం చేసుకొని 6వ స్థానంతో సరిపెట్టుకుంది.

మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ‌లు అంచనాలకు తగ్గట్లు ఆడలేకపోయారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి వైఫల్యం సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో వచ్చే ఏడాదికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. జట్టు బలహీనతలను అధిగమించేందుకు భారంగా మారిన ఆటగాళ్లను వేలంలోకి వదిలేసే ఛాన్స్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసే ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

IPL 2026 5 Players SRH May Release Before Mini-Auction

1. ఆడమ్ జంపా

స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసిన ఆడమ్ జంపా ఆరంభంలోనే గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని గైర్హాజరీ సన్‌రైజర్స్ విజయవకాశాలపై ప్రభావం చూపింది. అతను ఈ సీజన్‌లో 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. ఓవర్‌సీస్ ప్లేయర్ అయిన జంపాను వదిలేసి ఐపీఎల్ 2026 మినీవేలంలో దేశవాళీ స్పిన్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకునే అవకాశం ఉంది.

2. రాహుల్ చాహర్..

మరో స్పెషలిస్ట్ స్పిన్నర్‌ రాహుల్ చాహర్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాడు. రూ. 3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన చాహర్‌ పేలవ ఫామ్‌తో తుది జట్టులో చోటే దక్కించుకోలేకపోయాడు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. అతని వైఫల్యం కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ అవకాశాలను దెబ్బతీసింది. రాహుల్‌ చాహర్‌ను కూడా ఆరెంజ్ ఆర్మీ వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు రాహుల్ చాహర్ దేశవాళీ ప్రదర్శనపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

3.జీషన్ అన్సారీ..

మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్ జీషన్ అన్సారీ తన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో 9.84 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీసాడు. అతని వైఫల్యం కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. అయితే రూ. 40 లక్షలకే జీషన్ అన్సారీని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రిలీజ్ చేసే ముందు అతని ఫామ్‌ను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

4. మహమ్మద్ షమీ

ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో మహమ్మద్ షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. షమీ కోసం సుదీర్ఘ కాలంగా జట్టుకు ఆడిన భువనేశ్వర్ కుమార్‌ను కూడా వదులుకుంది. కానీ షమీ ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. 9 మ్యాచ్‌లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీసాడు. వరుస అవకాశాలు ఇచ్చినా షమీ ప్రదర్శన మెరుగవ్వకపోవడంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించి బెంచ్‌కే పరిమితం చేశారు. షమీ లేని 5 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ మూడు విజయాలు నమోదు చేసింది. పైగా షమీ వయసు కూడా పైబడటంతో అతన్ని వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఫ్లాట్‌గా ఉండే ఉప్పల్ వికెట్‌పై షమీ ప్రభావం చూపలేకపోతున్నాడు.

5.అభినవ్ మనోహర్

ఫినిషర్‌గా జట్టుకు ఉపయోగపడుతాడని భావించి రూ.3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఆరంభంలో వరుస మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 మ్యాచ్‌ల్లో 12.20 స్ట్రైక్‌రేట్‌తో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో భారత బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకునే అవకాశం ఉంది.

Story first published: Thursday, June 19, 2025, 17:42 [IST]
Other articles published on Jun 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+