For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ఆ ఐదుగురు ఔట్.. రాజస్థాన్ రాయల్స్ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడం.. కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కోవడంతో పాటు షిమ్రాన్ హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్, తీక్షణ వంటి ఆటగాళ్లు తేలిపోవడం రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్‌కు ముందు రాజస్థాన్ తమ జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఓ ఐదుగురి ఆటగాళ్లను వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది.

1. షిమ్రాన్ హెట్‌మైర్‌

ఐపీఎల్ 2025 సీజన్‌ మెగా వేలానికి ముందు షిమ్రాన్ హెట్‌మైర్‌‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 11 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్‌ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్నహెట్‌మైర్ వరుసగా మూడు సీజన్లలో ఫినిషర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతన్ని భారీ ధరకు రాజస్థాన్ రిటైన్ చేసుకుంది. కానీ అతను మాత్రం ఐపీఎల్ 2025 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 21.73 సగటుతో 239 పరుగులే చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. హెట్‌మైర్ వైఫల్యం కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే అతన్ని వేలంలోకి వదిలేసి మరో ఫినిషర్‌ను రాజస్థాన్ రాయల్స్ తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. లేదంటే తక్కువ ధరకు హెట్‌మైర్‌ను తిరిగి కొనుగోలు చేయవచ్చు.

IPL 2026 5 Players RR Likely to Release Ahead of IPL 2026 Mini-Auction

2. తుషార్ దేశ్‌పాండే

ఐపీఎల్ 2025 మెగా వేలంలో తుషార్ దేశ్‌పాండేను రాజస్థాన్ రాయల్స్ రూ6.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2023, 2024 సీజన్లలో సీఎస్‌కే తరఫున తుషార్ దేశ్‌పాండే 21, 17 వికెట్లతో మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో అతనిపై రాజస్థాన్ కోట్లు కుమ్మరించింది. కానీ ఐపీఎల్ 2025 సీజన్‌లో అతను 10 మ్యాచ్‌లు ఆడి 10.63 ఎకానమీతో 9 వికెట్లు మాత్రమే తీసాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో ప్రతిభావంతమైన భారత్ పేసర్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

3. మహీష్ తీక్షణ

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహీష్ తీక్షణను రాజస్థాన్ రాయల్స్ రూ 4.4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం 11 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో చేతులెత్తేసాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇప్పటికే నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతేకాకుండా వహీష్ తీక్షణ విదేశీ స్పిన్నర్. ఈ నేపథ్యంలోనే తీక్షణను వదిలేసి భారత స్పిన్నర్‌ను తీసుకునే ప్రయత్నం రాజస్థాన్ రాయల్స్ చేయవచ్చు.

4. ఫజల్‌హక్ ఫారూఖీ

అఫ్గనిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ ఫజల్‌హక్ ఫారూఖీని కూడా రాజస్థాన్ రాయల్స్ వదిలేసే అవకాశం ఉంది. రూ.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం ఐపీఎల్ 2025 సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేదు. 12.35 ఎకానమీతో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. అతని స్థానంలో మరో మెరుగైన విదేశీ పేసర్‌ను రాజస్థాన్ రాయల్స్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.

5. నితీష్ రాణా

టీమిండియా వెటరన్ బ్యాటర్ నితీష్ రాణాను కూడా రాజస్థాన్ రాయల్స్ వదిలేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 4.20 కోట్ల భారీ దరకు నితీష్ రాణాను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మిడిలార్డర్‌లో కీలకమవుతాడని భావించింది. కానీ అతను నిలకడలేమి ఆటతో జట్టుకు భారంగా మారాడు. 11 మ్యాచ్‌ల్లో 21.70 సగటుతో 217 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి నిలకడగా రాణించే ఇండియా బ్యాటర్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

Story first published: Friday, June 13, 2025, 13:33 [IST]
Other articles published on Jun 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+