For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ఆ ఐదుగురు ఔట్.. కేకేఆర్ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే

ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తీవ్రంగా నిరాశపరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌‌గా బరిలోకి దిగిన కేకేఆర్.. పేలవ ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా నిరాశపర్చగా.. భారీ అంచనాలు పెట్టుకున్న రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డికాక్ తేలిపోయారు. దాంతో కేకేఆర్ 14 మ్యాచ్‌లకు ఐదు మాత్రమే గెలిచి 8వ స్థానంలో నిలిచింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దవ్వడం కూడా కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపింది.

ఈ వైఫల్యం నేపథ్యంలోనే ఐపీఎల్ 2026 మినీ-వేలానికి ముందు జట్టులో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. జట్టు బలహీనతలను సరిదిద్దుకోవడంతో పాటు పర్స్ వాల్యూను పెంచుకునేందుకు కేకేఆర్ అవసరం లేని ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది.

IPL 2026 5 Players KKR Likely to Release Ahead of IPL 2026 Mini-Auction

1. వెంకటేష్ అయ్యర్

ఐపీఎల్ 2024 సీజన్‌లో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్‌లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 20.28 సగటుతో 142 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్ అయ్యర్‌ను వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పర్స్ వాల్యూను పెంచుకోవడానికి అయ్యర్‌ను వదిలేయవచ్చు. వేలంలో తక్కువ ధరకు అతన్ని తిరిగి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

2. క్వింటన్ డి కాక్

ఓపెనర్‌గా అదిరిపోయే ఆరంభాలు అందిస్తాడని భావించిన క్వింటన్ డికాక్ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌ మెగా వేలంలో ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం కేకేఆర్ రూ. 3.60 కోట్లు ఖర్చు చేసింది. కానీ అతను 8 మ్యాచ్‌ల్లో 21.71 సగటుతో 152 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రాజస్థాన్ రాయల్స్‌పై 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అతని స్థానంలో రెహమనుల్లా గుర్బాజ్‌ను ఆడించగా.. అతను కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలోనే డికాక్‌ను వదిలేసి భారత వికెట్‌ కీపర్‌ను తీసుకనే ప్రయత్నం కేకేఆర్ చేయవచ్చు.


3. అన్రిచ్ నోర్ట్జే

సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జేను కేకేఆర్ రూ. 6.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం 2 మ్యాచ్‌లే ఆడి ఒక వికెట్ తీసాడు. గాయంతో సీజన్ ఆరంభంలోనే జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో స్టార్ పేసర్‌ను కేకేఆర్ తీసుకోవచ్చు.

4. స్పెన్సర్ జాన్సన్

మిచెల్ స్టార్క్‌ స్థానాన్ని భర్తీ చేయగలడని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్‌ను రూ. 2.80 కోట్ల భారీ దరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం 4 మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క వికెట్ తీసాడు. 11.73 ఎకానమీతో ధారళంగా పరుగులిచ్చాడు. పేస్ విభాగాన్ని పటిష్టం చేయాలనుకుంటున్న కేకేఆర్.. జాన్సన్‌ను వదిలేసి మరో పేసర్‌ను తీసుకునే ప్రయత్నం చేయవచ్చు.

5. మొయిన్ అలీ

ఐపీఎల్ 2025 సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశాలు రాణించకపోయినా.. బౌలింగ్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. అంతేకాకుండా ప్లేయింగ్ ఎలెవన్ కాంబినేషన్‌లో అతను సెట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పటికే రస్సెల్, సునీల్ నరైన్ వంటి విదేశీ ఆల్‌రౌండర్లు ఉండటంతో మొయిన్ అలీని తుది జట్టులో ఆడించలేని పరిస్థితి నెలకొంది. రూ. 2 కోట్లు పెట్టిన తీసుకున్న మొయిన్ అలీ 6 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీసాడు. మొయిన్ అలీ స్థానంలో భారత యువ ఆటగాడిని కేకేఆర్ ఎంచుకోవచ్చు.

Story first published: Thursday, June 12, 2025, 15:54 [IST]
Other articles published on Jun 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+