For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. చిత్తుగా ఓడిన CSK!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. సోమవారం గౌహతి వేదికగా ఏపక్షంగా ముగిసిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. 15 ఏళ్ల సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో ఆర్చర్, బర్గర్, జడేజా సీఎస్‌కే పతనాన్ని శాసించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. జెమీ ఓవర్టన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/19), నండ్రే బర్గర్(2/19), రవీంద్ర జడేజా(2/18) రెండేసి వికెట్లు తీయగా.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.

IPL 2026 15-Year-Old Vaibhav Suryavanshi Historic 15-Ball Fifty Powers Rajasthan Royals to 8-Wicket Victory

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 128 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్) ఆచితూచి ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కంబోజ్ ఒక్కడే 2 వికెట్లు తీసాడు.

టర్నింగ్ పాయింట్ అదే..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం నష్టం చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడటంతో పిచ్‌పై మాయిశ్చర్ వచ్చి బౌలింగ్‌కు అనుకూలించింది. కండిషన్స్‌‌ను గౌరవించకుండా గుడ్డిగా ఆడిన సీఎస్‌కే బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. సంజూ శాంసన్(6), రుతురాజ్ గౌక్వాడ్(6), ఆయుష్ మాత్రే(0), మాథ్యూ షార్ట్(2) వైఫల్యం సీఎస్‌కే భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది.

పవర్ ప్లేలోనే ఈ నలుగురు ఔటవ్వడంతో తర్వాతి బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. జెమీ ఓవర్టన్ ఆచితూచి ఆడి పోరాడే లక్ష్యాన్ని అందించినా.. వైభవ్ సూర్యవంశీ ఊచకోతతో మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. సీఎస్‌కే బ్యాటర్లు తడబడిన పిచ్‌పై అతను అలవోకగా సిక్స్‌లు బాదాడు. తొలి ఓవర్‌లోనే అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను కార్తీక్ శర్మ వదిలేసాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది విజయాన్ని ఖాయం చేశాడు.

Story first published: Monday, March 30, 2026, 22:48 [IST]
Other articles published on Mar 30, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+