Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: చేజారిన హాఫ్ సెంచరీ.. బ్యాట్‌ను నేలకు కొట్టిన సిక్సర పిడుగు!(వీడియో)

రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజును వీడే సమయంలో తన షాట్ సెలెక్షన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ బ్యాట్‌ను గట్టిగా నేలకు కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

క్రీజులో ఉన్నంత సేపు వైభవ్ దూకుడుగా ఆడాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. భారీ షాట్ ఆడబోయి ఔటవ్వడం తనకు ఏ మాత్రం నచ్చదని గతంలోనే వైభవ్ వెల్లడించాడు. తాను ఇంకాసేపు క్రీజులో ఉంటే జట్టుకు భారీ స్కోర్ అందించడం లేదా త్వరగా లక్ష్యాన్ని ఛేదించేలా చేస్తానని చెప్పాడు.

IPL 2026 15-Year-Old Vaibhav Sooryavanshi Visibly Frustrated After Missing Half-Century vs KKR

ఈ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వైభవ్ దూకుడుగా ఆడాడు. యశస్వి జైస్వాల్‌(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39)తో కలిసి తొలి వికెట్‌కు వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. వైభవ్ బ్యాటింగ్‌కు వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తీతో పాటు క్యాచ్ పట్టిన రమణ్‌దీప్, కార్తీక్ త్యాగీ కూడా ఫిదా అయ్యారు.

అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. సుదీర్ఘ కాలం తర్వాత వరుణ్ చక్రవర్తీ తిరిగి ఫామ్ అందుకున్నాడు. నాలుగు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసాడు. కీలకమైన వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురెల్(5), రియాన్ పరాగ్(12)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల‌కు 155 పరుగులే చేసింది. ఓపెనర్లు వైభవ్, యశస్వి మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.

కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగీ(3/22), వరుణ్ చక్రవర్తీ(3/14) మూడేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Sunday, April 19, 2026, 17:16 [IST]
Other articles published on Apr 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+