Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arjun Tendulkar: సచిన్ కొడుకు టైమ్ వేస్ట్ చేస్తున్నాడు: యోగ్‌రాజ్ సింగ్

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను తన దగ్గరికి పంపిస్తే 6 నెలల్లోనే వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా తీర్చిదిద్దుతానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తెలిపాడు. అర్జున్ టెండూల్కర్‌లో గొప్ప బ్యాటర్ ఉన్నాడని, అతను బౌలింగ్ చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నాడని అభిప్రాయపడ్డాడు.

యోగ్ రాజ్ సింగ్ దగ్గర కొద్ది రోజుల శిక్షణ తీసుకున్న అర్జున్ టెండూల్కర్.. గోవా తరఫున అరంగేట్ర రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు.

IPL 2025 Yograj Singh Claims Arjun Tendulkar Being Wasted His Time With Bowling

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్.. అర్జున్ టెండూల్కర్‌ తన దగ్గరికి వస్తే వరల్డ్ గ్రేటెస్ట్ బ్యాటర్‌గా మార్చుతానని తెలిపాడు. 'అర్జున్ టెండూల్కర్ ఇప్పుడే నా దగ్గరికి వస్తే.. 6 నెలల్లో అతన్ని వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా నిలబెడుతా. బ్యాటర్‌గా అతని సత్తా ఏంటో ఎవరికీ తెలియదు. అతను నాతో 12 రోజులు మాత్రమే ఉన్నాడు.

ఆ తర్వాత ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. ఇది ఎవరైనా గ్రహించారా? గోవా టీమ్ ఇక్కడే ఉంది. సచిన్, యువరాజ్.. అర్జున్ టెండూల్కర్‌‌కు ట్రైనింగ్ ఇవ్వండని చెప్పారు. అతను నాతో 10-12 రోజులు ఉన్నాడు. అతనిలో గొప్ప బ్యాటర్ ఉన్నాడని గ్రహించాను. అతను బౌలింగ్‌తో సమయాన్ని వృథా చేస్తున్నాడనిపించింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా అతను ఆడాలి.'అని యోగ్ రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

ఫుట్‌టైమ్ కోచ్‌ అయిన యోగ్ రాజ్.. తన కొడుకు యువరాజ్ సింగ్‌కు అతనే స్వయంగా శిక్షణ ఇచ్చాడు. యువరాజ్ సింగ్ భారత్ తరఫున 304 వన్డేలు, 40 టెస్ట్‌లు, 58 టీ20లు ఆడాడు. అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు 17 ఫస్ట్ క్లాస్, 18 లిస్ట్-ఏ, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో 37 వికెట్లు తీయడంతో పాటు 532 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ 25 వికెట్లు తీసిన అర్జున్.. టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ముంబై తరఫున 5 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో ఒకే ఇన్నింగ్స్ ఆడి 13 పరుగులే చేశాడు.

Story first published: Monday, March 24, 2025, 22:25 [IST]
Other articles published on Mar 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+