For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shikhar Dhawan:క్రికెట్‌కు గబ్బర్ గుడ్‌బై.. ఐపీఎల్ సంగతేంటి?

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గబ్బర్ శనివారం ఓ వీడియోను పంచుకున్నాడు. 12 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు అండగా నిలిచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లకు శిఖర్ ధావన్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

దేశవాళీ క్రికెట్‌కు కూడా దూరంగా ఉంటానని చెప్పిన గబ్బర్.. ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. టీమిండియాకు ఆడటం తన కలని, అది నేరవేరిందని, సంతృప్తికరంగా తన కెరీర్‌ను ముగిస్తున్నానని శిఖర్ ధావన్ వీడియోలో పేర్కొన్నాడు. 2010-2022 వరకు భారత్ తరఫున శిఖర్ ధావన్ 167 వన్డేలు, 34 టెస్ట్‌లు, 68 టీ20లు ఆడాడు.

IPL 2025 Will Shikhar Dhawan play in IPL after announcing retirement

విరిగిన వేలితో శతకం..
వన్డేల్లో 6793, టెస్ట్‌ల్లో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 రన్స్ చేసిన గబ్బర్.. వన్డేల్లో 17, టెస్ట్‌ల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2015 వన్డే ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ 2018లో శిఖర్ ధావన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్‌కు మెరుగైన రికార్డు ఉంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో విరిగిన బొటన వేలితో శతకం సాధించాడు.

రోహిత్ శర్మతో కలిసి వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును కూడా అందుకున్నాడు. ఈ ఇద్దరూ 115 ఇన్నింగ్స్‌ల్లో 5148 పరుగులు చేశారు. ధావన్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో గంభీర్ ఆడుతాడా? లేక క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటాడా? అనేదానిపై స్పష్టత లేదు.

హైదరాబాద్‌ తరఫున..
ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ డెక్కన్ ఛార్చర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటి వరకు 222 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్..6768 పరుగులతో సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ధావన్.. చివరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాడు.

పంజాబ్ కింగ్స్‌కు సారథిగా ఉన్న ధావన్.. భుజ గాయంతో పూర్తి స్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండలేకపోయాడు. దాంతో పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. గబ్బర్ షేర్ చేసిన వీడియోలో ఐపీఎల్ గురించి ప్రస్తావించలేదు. కానీ పంజాబ్ కింగ్స్ జెర్సీ, సన్‌రైజర్స్ షీల్డ్‌ను చూపించాడు.

ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పినట్లే..!
మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం.. థ్యాంక్యూ శిఖర్ ధావన్ అని అతని ఎడిటెడ్ ఫొటోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌ను చూస్తుంటే ఐపీఎల్‌కు కూడా గబ్బర్ వీడ్కోలు పలికినట్లు అర్థమవుతోంది. గబ్బర్‌ను కొనసాగించేందుకు పంజాబ్ కింగ్స్ కూడా సముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ గబ్బర్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని భావిస్తే విదేశీ టీ20 లీగ్స్‌తో పాటు లెజెండ్స్ క్రికెట్ టోర్నీల్లో కనిపించే అవకాశం ఉంది.

Story first published: Saturday, August 24, 2024, 12:14 [IST]
Other articles published on Aug 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+