For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: గ్రీన్ జెర్సీ‌లో ఆర్‌సీబీ ఆటగాళ్లు.. ఎందుకంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో కీలక పోరుకు సిద్దమైంది. జైపూర్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఎందుకంటే ఇరు జట్టు తమ గత మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్‌సీబీ ఓడగా.. గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్‌ రాయల్స్ చిత్తయ్యింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి.

గ్రీన్ జెర్సీలో ఆర్‌సీబీ.?
అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా 2011 నుంచి ఆర్‌సీబీ ప్రతీ సీజన్‌లో ఓ మ్యాచ్‌ను గ్రీన్ జెర్సీలతో ఆడుతుంది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది. ప్రతి ఏడాది ఆర్‌సీబీ ఒక మ్యాచ్‌ను ఇలా గ్రీన్ జెర్సీతో ఆడటం ఆనవాయితీగా వస్తోంది. 2011 నుంచి గ్రీన్ జెర్సీని ధరించడాన్ని ఆనవాయితీగా మార్చుకుంది.

IPL 2025 Why do RCB wear the green jersey against RR
Photo Credit: X (@pumacricket)

ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సారి కూడా గ్రీన్ జెర్సీ మ్యాచ్ ఆడుతామని, రాజస్థాన్ రాయల్స్‌తోనే ఆ మ్యాచ్ అని ఆర్‌సీబీ పేర్కొంది. టాస్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఆర్‌సీబీ సారథి రజత్ పటీదార్ మొక్కను ప్రధానం చేయనున్నాడు.

అచ్చిరాని జెర్సీ..
అయితే ఆర్‌సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్‌లు పెద్దగా కలిసి రాలేదు. రాయల్ ఛాలెంజర్స్. పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ప్లేయర్లు గ్రీన్ జెర్సీతో గ్రౌండ్‌లోకి దిగారు. కానీ నాలుగు మ్యాచ్‌ల్లో‌నే విజయం సాధించారు. మరో 9 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. మరో మ్యాచ్ రద్దయ్యింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గ్రీన్ డే మ్యాచ్‌ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.

2016లో గుజరాత్ లయన్స్‌, 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2023లో రాజస్థాన్ రాయల్స్‌ను గ్రీన్ జెర్సీ మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఓడించింది. గతేడాది కేకేఆర్‌తో జరిగిన గ్రీన్ డే మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ప్రత్యర్థి టీమ్స్ వేదికల్లో అదరగొడుతున్న ఆర్‌సీబీ.. అదే జోరులో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించాలనుకుంటుంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ 3 గెలిచి రెండు ఓడింది.

RCB Green Jersey Match Results

Season Date Versus Venue Result
2011 Sunday, May 8, 2011 Kochi Tuskers Kerala M Chinnaswamy Stadium, Bengaluru RCB won by 9 wickets
2012 Monday, May 14, 2012 Mumbai Indians M Chinnaswamy Stadium, Bengaluru MI won 5 wickets
2013 Tuesday, May 14, 2013 Punjab Kings M Chinnaswamy Stadium, Bengaluru PBKS won by 7 wickets
2014 Saturday, May 24, 2014 Chennai Super Kings M Chinnaswamy Stadium, Bengaluru CSK won by 8 wickets
2015 Sunday, May 17, 2015 Delhi Capitals M Chinnaswamy Stadium, Bengaluru No Result
2016 Saturday, May 14, 2016 Gujarat Lions M Chinnaswamy Stadium, Bengaluru RCB won by 144 runs
2017 Sunday, May 17, 2017 Kolkata Knight Riders M Chinnaswamy Stadium, Bengaluru KKR won by 6 wickets
2018 Sunday, April 15, 2018 Rajasthan Royals M Chinnaswamy Stadium, Bengaluru RR won by 19 runs
2019 Sunday, April 7, 2019 Delhi Capitals M Chinnaswamy Stadium, Bengaluru DC won by 4 wickets
2020 Sunday, October 25, 2020 Chennai Super Kings Dubai International Cricket Stadium, Dubai CSK won by 8 wickets
2021 Monday, September 20, 2021 Kolkata Knight Riders Sheikh Zayed Stadium, Abu Dhabi KKR won by 9 wickets
2022 Sunday, May 8, 2022 Sunrisers Hyderabad Wankhede Stadium, Mumbai RCB won by 67 runs
2023 Sunday, April 23, 2023 Rajasthan Royals M Chinnaswamy Stadium, Bengaluru RCB won by 7 runs
2024 Sunday, April 21, 2024 Kolkata Knight Riders Eden Gardens, Kolkata KKR won by 1 run
Story first published: Saturday, April 12, 2025, 17:20 [IST]
Other articles published on Apr 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+