Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 మెగా వేలం.. 10 ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా ఇదే..!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఖరారు చేసింది. ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని శనివారం ప్రకటించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్(ఆర్‌టీఎం) కార్డ్ కూడా ఉంది. అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రతీ జట్టు పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 45 కోట్లు మాత్రమే మిగులుతాయి.

IPL 2025 Who Will Be The Players Retained by All Teams Ahead of Mega Auction

ఈ డబ్బుతోనే వేలంలో ఆర్‌టీఎమ్‌తో పాటు 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనామక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలనుకుంటే రూ. 4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఇద్దరు అనామక ఆటగాళ్లతో పాటు ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లను తీసుకోవచ్చని తెలిపింది. ఈ ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లలో విదేశీ ఆటగాళ్ల‌పై ఎలాంటి పరిమితి విధించలేదు.

ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండటంతో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్ లేని ఆటగాడిని అనామక ప్లేయర్‌గా పరిగణించవచ్చని పేర్కొంది. ఇది సీఎస్‌కేకు కలిసి రానుంది. మహేంద్ర సింగ్ ధోనీని అనామక ప్లేయర్‌గా రూ. 4 కోట్లకే ఆ జట్టు తీసుకోనుంది. అయితే ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 75 కోట్లు ఖర్చు అవనున్నాయి.

ఈ క్రమంలో ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ముంబై, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ మినహా ఇతర జట్లు 5గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోకపోవచ్చు. 10 ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా అంచనాపై ఓ లుక్కెద్దాం.

10 ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా(అంచనా)

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, రజత్ పటీదార్, విజయ్‌కుమార్ వైశాఖ్(అనామక), విల్ జాక్స్-ఆర్‌టీఎమ్, యశ్ దయాల్-ఆర్‌టీఎమ్

సీఎస్‌కే: రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే-ఆర్‌టీఎమ్, మతీష పతీరణ, మహేంద్ర సింగ్ ధోనీ(అనామక), తుషార్ దేశ్‌పాండే-ఆర్‌టీఎమ్

ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్-ఆర్‌టీఎమ్, ట్రిస్టన్ స్టబ్స్-ఆర్‌టీఎమ్, అభిషేక్ పోరెల్(అనామక)-ఆర్‌టీఎమ్

గుజరాత్ టైటాన్స్:
శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, మహమ్మద్ షమీ-ఆర్‌టీఎమ్, డేవిడ్ మిల్లర్-ఆర్‌టీఎమ్, రాహుల్ తేవాటియా(అనామక)-ఆర్‌టీఎమ్

లక్నో సూపర్ జెయింట్స్:
నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినీస్-ఆర్‌టీఎమ్, మయాంక్ యాదవ్

కేకేఆర్:
ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రింకూసింగ్, వరుణ్ చక్రవర్తీ/హర్షిత్ రాణా-ఆర్‌టీఎమ్, శ్రేయస్ అయ్యర్/వెంకటేశ్ అయ్యర్-ఆర్‌టీఎమ్

ముంబై ఇండియన్స్:
జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ-ఆర్‌టీఎమ్, ఇషాన్ కిషన్-ఆర్‌టీఎమ్, నెహాల్ వదేరా(అనామక)-ఆర్‌టీఎమ్

పంజాబ్ కింగ్స్:
అర్ష్‌దీప్ సింగ్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్, శశాంక్ సింగ్(అనామక), అషుతోష్ శర్మ(అనామక), ప్రభ్‌సిమ్రాన్ సింగ్-ఆర్‌టీఎమ్

రాజస్థాన్ రాయల్స్:
సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్/ధ్రువ్ జురెల్-ఆర్‌టీఎమ్, సందీప్ శర్మ(అనామక)-ఆర్‌టీఎమ్, రియాన్ పరాగ్-ఆర్‌టీఎమ్

సన్‌రైజర్స్ హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి-ఆర్‌టీఎమ్, హెన్రీచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్-ఆర్‌టీఎమ్

Story first published: Sunday, September 29, 2024, 17:41 [IST]
Other articles published on Sep 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+