For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Priyansh Arya: ఎవడ్రా వీడు.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రోజుకో స్టార్ ఉద్భవిస్తున్నాడు. మొన్న విజ్ఞేష్ పుతుర్.. నిన్న విప్రజ్ నిగమ్.. నేడు ప్రియాన్ష్ ఆర్య సంచలన ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచారు. గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ప్రియాన్ష్ ఆర్య.. తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగి విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్‌ కింగ్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. దూకుడుగా ఆడే క్రమంలో అతను తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అతను కొట్టి రెండు సిక్స్‌లు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏ మాత్రం భయం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడిన ప్రియాన్ష్ ఆర్యను చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతను ఎవరా? అని ఆరా తీస్తున్నారు.

IPL 2025 Who Is Priyansh Arya The PBKS Opener Who Hit Six Sixes In An Over

ఎవరీ ప్రియాన్ష్ ఆర్య?
ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య.. తల్లిదండ్రులు వృత్తి రీత్యా టీచర్లు. ప్రియాన్ష్ ఆర్య సరదాగా స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడేవాడు. ఆటపై ఉన్న మక్కువను గమనించిన అతని తండ్రి సంజయ్ భరద్వాజ్ కోచింగ్ అకాడమీలో చేర్పించాడు. అక్కడే బ్యాటింగ్ నేర్చుకున్న ప్రియాన్ష్ ఆర్య.. గంభీర్‌ పర్యవేక్షణలో మరింత రాటు దేలాడు. అతని ఆటకు ఫిదా అయిన గంభీర్.. ప్రియాన్ష్ ఆర్యకు క్రికెట్ కిట్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు.

ఢిల్లీ తరఫున ఏజ్ క్రికెట్ ఆడిన ప్రియాన్ష్.. 2021లో దేశవాళీ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. 2023లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు స్పిన్నర్లు, కర్ణాటక పేసర్లను చితక్కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరుసటి ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 176.63 స్ట్రైక్‌రేట్‌తో 325 పరుగులు చేశాడు. 43 బంతుల్లోనే 102 పరుగులు చేసి టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు.

ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు..
ఆ తర్వాత ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాది దేశంలోని క్రికెట్‌ అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు. ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్‌కు ఆడిన ప్రియాన్ష్.. 608 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో ఆయుష్ బదోనితో కలిసి 286 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఈ ప్రదర్శన నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 3.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. టీమ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టడంతో తొలి మ్యాచ్‌లోనే అతనికి అవకాశం ఇచ్చింది. ఈ ఛాన్స్‌ను అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇక ప్రియాన్ష్ ఆర్య.. ఇదే జోరు కొనసాగిస్తే త్వరగానే భారత జట్టులోకి రానున్నాడు.

Story first published: Tuesday, March 25, 2025, 22:12 [IST]
Other articles published on Mar 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+