Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి త్వరగానే తేరుకుంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. ఈ సీజన్‌లో ఇదే తొలి సూపర్ ఓవర్ మ్యాచ్. ఐపీఎల్‌లో నాలుగేళ్ల తర్వాత సూపర్ ఓవర్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 49), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ట్రిస్టన్ స్టబ్స్(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), అక్షర్ పటేల్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/32) రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ(1/40), వానిందు హసరంగా(1/38) చెరో వికెట్ పడగొట్టారు.

IPL 2025 What Was The Turning Point As DC Beat RR In Super-Over Thriller

అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), నితీష్ రాణా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్(1/23), కుల్దీప్ యాదవ్(1/33), మిచెల్ స్టార్క్(1/36) తలో వికెట్ తీసారు.

సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగులకే ఆలౌటైంది(సూపర్ ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోతే ఆలౌటైనట్లు). రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ రనౌట్ అయ్యారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు బంతుల్లో 2, 4, 1, 6 బాది విజయం సాధించింది.

మలుపు తిప్పిన స్టార్క్..
ఈ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో ధారళంగా పరుగిలిచ్చిన స్టార్క్.. చివర్ స్పెల్‌లో మాత్రం నిప్పులు చెరిగాడు. ముఖ్యంగా 18వ ఓవర్‌లో క్రీజులో సెట్ అయిన నితీష్ రాణాను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే ఇచ్చిన అతను ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు ఇవ్వకుండా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కచ్చితమైన యార్కర్లతో మ్యాచ్‌ను టైగా మార్చాడు. సూపర్ ఓవర్‌లోనూ యార్కర్లతో రాజస్థాన్ బ్యాటర్లను ఒత్తిడికి గురి చేసి చిరస్మరణీయ విజయాన్నందించాడు. స్టార్క్ వేసిన మూడు ఓవర్లు(సూపర్ ఓవర్‌తో) ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి.

Story first published: Thursday, April 17, 2025, 8:03 [IST]
Other articles published on Apr 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+