తాను తెలుగు సినిమాలు చూస్తానని శ్రీలంక స్టార్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వానిందు హసరంగా తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హసరంగా (4/35) అద్భుత ప్రదర్శన కనబర్చాడు. క్రీజులో సెట్ అయిన రాహుల్ త్రిపాఠి(23), రుతురాజ్ గైక్వాడ్(63), శివమ్ దూబే(18)లతో పాటు విజయ్ శంకర్(9)ను హసరంగా పెవిలియన్ చేర్చి సీఎస్‌కే పతనాన్ని శాసించాడు.
వికెట్ తీసిన ప్రతీసారి పుష్ప ఐకానిక్ 'తగ్గేదేలే'స్టైల్‌లో హసరంగా సంబరాలు చేసుకున్నాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హసరంగాను.. పుష్ప సెలెబ్రేషన్స్ గురించి ప్రశ్నించగా.. తాను తెలుగు, తమిళం, మళయాళం సినిమాలు చూస్తానని వెల్లడించాడు.

'బేసిక్స్ తగ్గట్లు నేను బౌలింగ్ చేశాను. స్టంప్ లైన్‌తో పాటు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో బంతులు వేసాను. మా బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని నమోదు చేయడంతో మా పని సులువైంది. రుతురాజ్ గైక్వాడ్‌ను ఔట్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. అతను డేంజరస్ బ్యాటర్. అతను ఔటవ్వకుంటే.. మ్యాచ్‌ను మా నుంచి లాగేసేవాడు. మా ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్‌లు అద్భుతంగా అందుకున్నారు.
వికెట్ తీసినప్పుడు పుష్ప స్టైల్‌లో సంబరాలు చేసుకోవడం నచ్చింది. భారత్‌లో నేను తెలుగు, మలయాళంతో పాటు తమిళ సినిమాలు చూస్తుంటా. మరీ ముఖ్యంగా పుష్ప సినిమాను చాలా సార్లు చూశాను. అందుకే అలా సంబరాలు చేశాను. మా జట్టుకు అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉంది. మిడిల్ ఓవర్లలో కట్టడి చేస్తున్నాం. జట్టులో నాకు విభిన్నమైన బాధ్యతలు ఉన్నాయి. కొత్త బంతితో పాటు పాత బంతితో బౌలింగ్ చేయాలి.'అని హసరంగా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ ద్వారా హసరంగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓ మ్యాచ్‌లో నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్ల ప్రదర్శన చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో సోహైల్ తన్వీర్.. సీఎస్‌కేపైనే ఆరు(6/14) వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నైపై నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో స్పిన్నర్ హసరంగ. 2011లో ముంబై తరఫున హర్భజన్ సింగ్(5/18), కేకేఆర్ తరఫున బ్రాడ్ హాగ్(4/29) 2015లో ఈ ఫీట్ సాధించారు.