For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతనే: విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. జస్‌ప్రీత్ బుమ్రా వరల్డ్ బెస్ట్ బౌలర్ అని కొనియాడాడు. క్రికెట్ కెరీర్‌లోనే తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అని తెలిపాడు. అతన్ని ఎదుర్కోవడం సరదాగా ఉంటుందని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఆర్‌సీబీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. మూడు ఫార్మాట్లలో అతనే అత్యుత్తమ బౌలర్. ఐపీఎల్‌లో అతను కొన్నిసార్లు నన్ను ఔట్ చేశాడు. మరికొన్నిసార్లు నేను అతనిపై పే చేయి సాధించాను. అతన్ని నేను ఎదుర్కొన్న ప్రతీసారి చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే నెట్స్‌లో కూడా మేం మ్యాచ్ ఆడుతున్నట్లే తలపడుతాం. ఐపీఎల్ తరహా ఇంటెన్సిటీని చూపిస్తాం. అతనికి నన్ను ఎలా ఔట్ చేయాలో తెలుసు. నేను ఔటవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. అతని బౌలింగ్‌ను నేను బాగా ఆస్వాదిస్తాను. అలాగే కఠినంగా భావిస్తాను.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

IPL 2025 Virat Kohli names toughest bowler ever faced

ఐపీఎల్‌లో జస్‌ప్రీత్ బుమ్రాను విరాట్ కోహ్లీ 16 సార్లు ఎదుర్కొని ఐదు సార్లు ఔట్ చేశాడు. కోహ్లీ మాత్రం 147.36 స్ట్రైక్‌ రేట్‌తో 140 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌కు మార్చి 22న తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తలపడనున్నాయి.

ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌లకు బుమ్రా దూరం కానున్నాడు. ప్రస్తుతం అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతని ఫిట్‌నెస్‌పై క్లీన్ ఛీట్ ఇవ్వలేదు. దాంతోనే బుమ్రా ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఏప్పిల్‌లో ముంబై ఇండియన్స్‌తో బుమ్రా కలవనున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్‌లో బుమ్రా వెన్ను గాయానికి గురైన విషయం తెలిసిందే.

Story first published: Monday, March 17, 2025, 14:46 [IST]
Other articles published on Mar 17, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+