రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 300 సిక్స్‌ల మైలురాయి అందుకున్న కోహ్లీ.. ఒకే జట్టు తరఫున ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. సీఎస్‌కే బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్‌లో చివరి రెండు బంతులను కోహ్లీ భారీ సిక్సర్లుగా మలిచి ఈ ఫీట్ సాధించాడు.
కోహ్లీ@300
ఒకే జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో విరాట్ కోహ్లీ 301* సిక్స్‌లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత క్రిస్ గేల్ ఆర్‌సీబీ తరఫున 263 సిక్స్‌లు కొట్టగా.. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 262, కీరన్ పోలార్డ్ 258 సిక్స్‌లు బాదారు. సీఎస్‌కే తరఫున ధోనీ 257 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్‌లో గత 18 సీజన్లుగా విరాట్ కోహ్లీ ఆర్‌సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీ నమోదు చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

డేవిడ్ వార్నర్ రికార్డ్ బద్దలు..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 500 ప్లస్ సీజన్ రన్స్ చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 505 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో కోహ్లీ 500 ప్లస్ రన్స్ చేయడం ఇది 8వ సారి. ఈ క్రమంలో అతను డేవిడ్ వార్నర్ రికార్డ్‌ను అధిగమించాడు. వార్నర్ 7 సార్లు 500 ప్లస్ రన్స్ చేశాడు.
గబ్బర్ రికార్డ్ బ్రేక్..
చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గానూ కోహ్లీ నిలిచాడు. తాజా హాఫ్ సెంచరీతో అతను 10 సార్లు సీఎస్‌కేపై 50 ప్లస్ రన్స్ చేశాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ 9 సార్లు సీఎస్‌కేపై 50 ప్లస్ రన్స్ చేశారు. ఐపీఎల్‌లో ఓ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ కోహ్లీ నిలిచాడు. సీఎస్‌కేపై ఇప్పటి వరకు కోహ్లీ 1146 రన్స్ చేశాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్( పంజాబ్ కింగ్స్‌పై 1134), విరాట్ కోహ్లీ(ఢిల్లీపై 1130), విరాట్ కోహ్లీ(పంజాబ్ 1104), డేవిడ్ వార్నర్(కేకేఆర్‌పై 1093), రోహిత్ శర్మ(కేకేఆర్‌పై 1083) పరుగులు చేశాడు.