Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రూ. 23.75 కోట్లు.. 142 పరుగులు

ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రస్థానం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయ్యింది. దాంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్‌ అధికారికంగా నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచినా.. ప్లే ఆఫ్స్ చేరలేదు. ఇప్పటి వరకు కేకేఆర్ 13 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, రెండు మ్యాచ్‌ల రద్దుతో 12 పాయింట్స్‌తో టేబుల్‌లో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

ఆరెంజ్ ఆర్మీతో జరిగే ఆఖరి మ్యాచ్ గెలిచినా కేకేఆర్ ఖాతాలో 14 పాయింట్స్ చేరుతాయి. పాయింట్స్ టేబుల్‌లో ఇప్పటికే టాప్-4 జట్లు 14 పాయింట్స్ ప్లస్‌తో పాటు మెరుగైన రన్‌రేట్‌‌తో ఉన్నాయి. దాంతో కేకేఆర్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు. వర్షంతో రెండు మ్యాచ్‌లు రద్దవ్వడం కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది.

ఒకే ఒక్క హాఫ్ సెంచరీ..
గత సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచిన కేకేఆర్.. ఈ సీజన్‌లో ఆ జోరు కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా రూ. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ 20.29 సగటుతో 142 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉండటం విశేషం. అతని వైఫల్యం కేకేఆర్ విజయవకాశాలు దెబ్బతీసింది. గత రెండు సీజన్లలో (2023, 2024) కలిపి వెంకటేశ్ అయ్యర్ 774 పరుగులు చేసాడు. ఈ ప్రదర్శనతోనే వెంకటేశ్ అయ్యర్‌కు కేకేఆర్ రూ. 23.75 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఈ సారి అతను తేలిపోయాడు.

IPL 2025 Venkatesh Iyer s 23 75 Crore Price Tag Under Scrutiny After 142 Runs

కోటికి 6 పరుగులు..
వెంకటేశ్ అయ్యర్ కారణంగానే కేకేఆర్ ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతేడాది తరహాలో అతను రాణించి ఉంటే కేకేఆర్‌ ప్లే ఆఫ్స్ చేరేదని జోస్యం చెబుతున్నారు. వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్‌లో దాదాపు కోటికి 6 పరుగులు చొప్పున రాణించాడని సెటైర్లు పేల్చుతున్నారు. 'ఓ పిలగా వెంకటి.. రూ. 23.75 కోట్లకు 142 పరుగులా?'అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. చేతికి గాయం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు వెంకటేశ్ అయ్యర్ దూరమయ్యాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా వెంకటేశ్ అయ్యర్‌ చేతికి గాయమైంది. అతని గాయంపై ఎలాంటి అప్‌డేట్ లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆఖరి మ్యాచ్ ఆడుతాడా? లేదా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దాంతో కేకేఆర్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.

Story first published: Sunday, May 18, 2025, 11:53 [IST]
Other articles published on May 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+