For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో అన్‌సోల్డ్.. ఒకే ఓవర్‌లో 6 ఫోర్లు! (వీడియో)

ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఒకే ఓవర్‌లో 6 బౌండరీలు బాదాడు. ఆస్ట్రేలియా ఫ్రాంచైజీ టీ20 క్రికెట్ టోర్నీ బిగ్ బిష్ లీగ్(బీబీఎల్)లో మెల్ బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బెన్ డకెట్.. సిడ్నీ సిక్సర్స్‌‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

అకీల్ హోస్సేన్ వేసిన ఓవర్‌లో వరుసగా 6 బౌండరీలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సిడ్నీ సిక్సర్స్ బౌలింగ్ ఎంచుకోగా.. మెల్ బోర్న్ స్టార్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బెన్ డకెట్.. పవర్ ప్లేలోని చివరి ఓవర్‌లో వరుసగా 6 బౌండరీలు బాదాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IPL 2025 unsold player Ben Duckett smashes six fours in an over in BBL

ఈ మ్యాచ్‌లో బెన్ డకెట్ 29 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. దాంతో మెల్ బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. బెన్ డకెట్‌కు తోడుగా గ్లేన్ మ్యాక్స్‌వెల్(17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32) రాణించాడు. సిడ్నీ సిక్సర్స్ బౌలర్లలో జాక్సన్ బర్డ్ మూడు వికెట్లు తీయగా.. బెన్, టాడ్ ముర్ఫీ రెండేసి వికెట్లు పడగొట్టారు. అకీల్ హోస్సెన్, హేడన్ కేర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సిడ్నీ సిక్సర్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. 8 వికెట్ల తేడాతో మెల్ బోర్న్ స్టార్స్‌ను చిత్తు చేసింది. జేమ్స్ విన్స్(58 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. జోష్ ఫిలిప్పి(23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), జోర్డాన్ సిల్క్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. మెల్ బోర్న్ బౌలర్లలో టామ్ కరన్, ఉసామ మిర్ చెరో వికెట్ తీసారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో బెన్ డకెట్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న అతన్ని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

Story first published: Thursday, December 26, 2024, 17:00 [IST]
Other articles published on Dec 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+