Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: ట్రావిస్ హెడ్ భారీ సిక్సర్.. ఎగిరి గంతేసిన కావ్య పాప!(వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఘనంగా ప్రారంభించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనకే సాధ్యమైన షాట్లతో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతను కొట్టిన భారీ సిక్సర్‌ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అతని షాట్ ధాటికి బంతి ఏకంగా 105 మీటర్ల దూరంలో పడింది.

ఈ సిక్సర్‌కు అభిమానులతో పాటు కామెంటేటర్లు అవాక్కయ్యారు. ట్రావిస్ హెడ్ సిక్సర్‌కు బంతి నాగోల్‌లో పడిందని అతని బ్యాటింగ్‌ను కామెంటేటర్స్ మెచ్చుకున్నారు. ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. చప్పట్లతో చిరు నవ్వులు చిందిస్తూ అతని బ్యాటింగ్‌ను ఆస్వాదించింది.

IPL 2025 Travis Head Smashes 105 Meter Six Against Jofra Archer in SRH vs RR Clash
Photo Credit: Twitter

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలి ఓవర్‌ నుంచే అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు. ఆరంభంలో కాస్త స్లోగా ఆడిన ట్రావిస్ హెడ్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అభిషేక్ శర్మ(24) ఔటైనా.. ఇషాన్ కిషన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది.

పవర్ ప్లే అనంతరం కూడా ఇదే దూకుడు కనబర్చిన ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరు కనబర్చిన ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67)ను తుషార్ దేశ్‌పాండే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Story first published: Sunday, March 23, 2025, 16:19 [IST]
Other articles published on Mar 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+