సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్ పోకిరి అని ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఫన్ చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు ప్యాట్ కమిన్స్ ఈ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. సన్‌రైజర్స్ హెడ్ మాస్టర్, కరెంట్ తీగ, పోకిరి, ఊరమాస్ బ్యాటర్లు ఎవరో చెప్పారు.
అప్‌కమింగ్ మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తే ఈజీగా ప్లే ఆఫ్స్ చేరుతామని ట్రావిస్ హెడ్ తెలిపాడు. గత రెండు మ్యాచ్‌ల్లో కొన్ని విషయాల్లో తమకు కలిసి రాలేదని, టీ20ల్లో మూమెంటమ్ చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. 'ఆడబోయే కొన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే మంచి పొజిషన్‌లో ఉంటాం. ప్రస్తుతానికైతే టాప్-4లో ఉండటంపై ఫోకస్ పెట్టాం. ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. లీగ్ దశ ముగిసేసరికి టాప్‌లో ఉంటే టైటిల్ గెలిచేందుకు మంచి అవకాశం ఉంటుంది. సానుకూల ధృక్పథంతో ఆడుతాం. అన్ని మ్యాచ్‌ల్లో ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. తొలి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయగలిగాం. గత రెండు మ్యాచ్‌ల్లో కొన్ని విషయాల్లో మాకు కలిసి రాలేదు. టీ20 క్రికెట్ మూమెంటమ్ ముఖ్యం.'అని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల ఫన్ చిట్ చాట్..
1. హెడ్ మాస్టర్ అనగా గుర్తొచ్చే ఆటగాడు ఎవరు..?
కమిన్స్: ట్రావిస్ హెడ్
క్లాసెన్: హర్షల్ పటేల్
2. కరెంట్ తీగ అనగానే గుర్తొచ్చే ప్లేయర్..?
ట్రావిస్ హెడ్: నితీష్ కుమార్ రెడ్డి
కమిన్స్: డానియల్ వెటోరి
క్లాసెన్: ఇషాన్ కిషన్
3. పోకిరి అనగానే గుర్తొచ్చే ప్లేయర్..?
ట్రావిస్ హెడ్: ఇషాన్ కిషన్
కమిన్స్: ఇషాన్ కిషన్
క్లాసెన్: అనికేత్ వర్మ
4. మాస్ ఊరమాస్ అనగానే గుర్తొచ్చే ప్లేయర్..?
ట్రావిస్ హెడ్: అభిషేక్ శర్మ