Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఏం కులగజ్జి గాళ్లు రా బాబు! (వీడియో)

ఏఐ కాలంలోనూ కుల పురుగు కుట్టంది ఎక్కడా..? కుల జాడ్యం లేనిదెక్కడా..? కూటికి లేనోడైనా కోట్లకి అధిపతి అయినా.. ఈ కులం కంపులో ఉండాల్సిందే. చెప్పుకోవడానికి సిగ్గుగానే ఉన్నా మన కులపోడంటే ఎక్కడలేని మోజు. ఆంధ్రలో అయితే ఇది మరి ఎక్కువ..! ఈ కులం బూజు వదల్లేదనడానికి ఇది మరో ఉదాహరణ..!

ఐపీఎల్ 2025 సీజన్‌ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయంశమైంది. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్, తెలుగు తేజం సత్యనారయణ రాజు‌తో కొంతమంది తెలుగు ఫ్యాన్స్ చేసిన చిట్ చాట్.. కుల జాడ్యం ఎంతలా ఉందో తెలియజేసింది.

IPL 2025 Telugu Fans Engage in Chit-Chat with MI Player Satyanarayana Raju Caste Debate Sparks

ఆర్‌సీబీతో వాంఖడే మైదానం వేదికగా ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తున్న సత్యనారయణ రాజును కొంతమంది తెలుగు ఫ్యాన్స్ పలకరించారు.'రాజు గారూ.. మేం మీ కులపోళ్లమే.. ఈస్ట్, వెస్ట్ రాజులం అండి. మీ కోసం, తిలక్ వర్మ కోసం రూ. 12 వేలు పెట్టి మ్యాచ్‌కు వచ్చాం. ఆల్‌ది బెస్ట్. మాది వైజాగ్. ఎమ్మెస్కే ఫ్రెండ్. ఈ స్టేడియం మనమే కట్టాం. ఎయిర్‌పోర్ట్ కూడా మనమే కట్టాం. ఫోటో తీసుకుంటాం అండి'అని వారు సత్యనారయణ రాజును పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో కూడా కుల పిచ్చి ఏంటని మండిపడుతున్నారు.

ఆంధ్ర ప్లేయర్ అయిన సత్యనారయణ రాజు ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం అందుకున్నాడు. సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన సత్యనారయణ రాజు.. పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. రెండు మ్యాచ్‌ల్లో అతను ఒకే ఒక్క వికెట్ తీసాడు. సత్యనారయణ రాజును ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Wednesday, April 9, 2025, 18:00 [IST]
Other articles published on Apr 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+