ఐపీఎల్ 2025 సీజన్‌ను ముంబై ఇండియన్స్.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ప్రారంభించనుంది. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ముంబై తమ టైటిల్ వేటను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. మార్చి 23న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరంకానున్నాడు. అతనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ మ్యాచ్ నిషేధం విధించడంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరం కానున్నాడు.
గత సీజన్‌లోనే ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా.. జట్టుకు ఆశించిన ఫలితాన్ని అందించలేదు. అతని కెప్టెన్సీలో ముంబై చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్‌కు కారణమయ్యాడు. దాంతో నిబంధనల ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. అతనికి రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది.

హార్దిక్ పాండ్యాపై నిషేధం..
గత సీజన్‌లో ముంబై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్ పాండ్యాపై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే హార్దిక్ పాండ్యా నిషేధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు పాండ్యా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్దిక్ పాండ్యాపై నిషేధం నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే చర్చ జోరుగా సాగుతున్నది. వెన్ను గాయం కారణంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది.
కెప్టెన్‌గా సూరీడు..
ఈ క్రమంలోనే హార్దిక్ గైర్హాజరీలో ముంబైని ఎవరు నడిపిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టు సారథ్య బాధ్యతలు చేపడుతాడా? లేక సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్‌కు మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో టీమిండియా 18 మ్యాచుల్లో.. నాలుగు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయి.