Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: డేంజరస్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్..తుది జట్టు అంచనా ఇదే!

ఆడింది 12 సీజన్లు.. ఓ సారి చాంపియన్‌.. రెండు సార్లు రన్నరప్.. నాలుగు సార్లు ప్లే ఆఫ్స్.. ఇంకో రెండు సార్లు ఆరో స్థానం.. మరో మూడు సార్లు అట్టడుగు స్థానం.. ఐపీఎల్‌లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానమిది.! చూస్తుండగానే పాయింట్ల పట్టికలో పైకెళ్లడం.. చడీచప్పుడు లేకుండా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లడం ఆరెంజ్ ఆర్మీకి వెన్నతో పెట్టిన విద్య.! జట్టును నడిపించేది ఎవరైనా పెర్ఫామెన్స్‌లో ఏమాత్రం తేడా ఉండదు.!

టీమ్ బ్యాలెన్స్‌లో మార్పు కనిపించదు. రెండు వైపులా పదునున్న కత్తిలా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్‌లో ఇరగదీసి ప్రత్య్రర్థి తలవంచడం సన్‌రైజర్స్ స్టైల్.. దాంతో ధనాధన్ లీగ్‌లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సన్‌రైజర్స్.. నయా సీజన్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. విధ్వంసకర బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ గతేడాది తృటిలో టైటిల్ చేజార్చుకొని రన్నరప్‌గా సరిపెట్టుకుంది. మరీ ఈసారి ఆరెంజ్ ఆర్మీ తమ సత్తా చూపిస్తుందా? అంచనాలను అందుకుంటుందా.. మరోసారి చాంపియన్‌గా నిలుస్తుందా? అనేది చూడాలి.!

IPL 2025 Sunrisers Hyderabad strength weakness and best playing 11
Photo Credit: SRH

టైటిలే లక్ష్యంగా..
2013లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్.. డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016 టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2020 వరకు వరుసగా ఐదు సీజన్లు ప్లే ఆఫ్స్ చేరింది. 2021-23 వరకు దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. కానీ గత సీజన్‌లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు తమ కోర్‌ టీమ్‌ను అంటిపెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ.. వేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మార్చి 23న ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.

సన్‌రైజర్స్ బలాలు..

  • ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్‌లతో కూడిన పవర్ ఫుల్ బ్యాటింగ్.
  • ఎంతో అనుభవం కలిగిన ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఉండటం.
  • రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలతో కూడిన స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్. ప్రతిభ కలిగిన ఆటగాళ్లతో బలమైన బెంచ్ .

సన్‌రైజర్స్ బలహీనతలు..

  • టీ20 స్పెషలిస్ట్ బౌలర్ లేకపోవడం. కీలక ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పే బౌలర్ లేడు
  • బలహీనంగా మిడిలార్డర్. గతేడాది జట్టుకు ఆడిన ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠిల స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు లేకపోవడం.
  • ఓవర్‌సీస్ ఆటగాళ్లు అయిన ప్యాట్ కమిన్స్, హెన్రీచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్‌లపైనే ఎక్కువగా ఆధారపడటం.

టీమ్ కాంబినేషన్..
సన్‌రైజర్స్ ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆడనుండగా.. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్‌లు బరిలోకి దిగనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ అభినవ్ మనోహర్, పేస్ ఆల్‌రౌండర్లుగా హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రాహుల్ చాహర్ ఆడమ్ జంపా బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ పేసర్‌గా మహమ్మద్ షమీ ఆడనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ

ఇంపాక్ట్ ప్లేయర్: సచిన్ బేబీ/అథర్వ టైడ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:

హెన్రీచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్ , ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్‌ కిషన్‌ , అభినవ్ మనోహర్‌, రాహుల్‌ చాహర్‌, ఆడమ్ జంపా , సిమర్‌జీత్ సింగ్‌ , అథర్వ టైడ్ , జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనాద్కత్, కమిందు మెండీస్, అనికేత్ వర్మ, వియాన్ మల్డర్, అనికేత్ వర్మ, ఇషాన్ మలింగా, సచిన్ బేబీ.

Take a Poll
Story first published: Wednesday, March 12, 2025, 13:31 [IST]
Other articles published on Mar 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+