ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, కామిందు మెండీస్‌లను తుది జట్టు నుంచి తప్పించింది. అభినవ్ మనోహర్, సచిన్ బేబీలను తుది జట్టులోకి తీసుకుంది. ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు.
నితీష్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టడంపై ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో పర్వాలేదనిపించిన నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నిస్తున్నారు. టాస్ సందర్భంగా ప్యాట్ కమిన్స్ తుది జట్టులో మార్పుల గురించి ప్రస్తావించలేదు. నితీష్ కుమార్ రెడ్డిని బయట పెట్టడానికి గల కారణాలను వెల్లడించలేదు. పేలవ ప్రదర్శన కనబరుస్తున్న షమీపై వేటు వేసారనే విషయం అర్థమవుతుంది. కానీ నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు తుది జట్టు నుంచి తప్పించారనేది అభిమానులకు అర్థం కాలేదు.

ఈ ప్రశ్నకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి అనారోగ్యానికి గురవ్వడంతోనే ఈ మ్యాచ్ ఆడటం లేదని ట్వీట్ చేసింది. 'నితీష్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతనికి ఒంట్లో బాలేదు.'అని పేర్కొంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్స్ ఎమ్మెస్కే ప్రసాద్, హనుమ విహారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. నితీష్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి బంతికే కరుణ్ నాయర్(0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన ప్యాట్ కమిన్స్.. తన మరుసటి ఓవర్ ఫస్ట్ బాల్‌కు ఫాఫ్ డుప్లెసిస్(3)ను ఔట్ చేశాడు. మూడో ఓవర్ తొలి బంతికి అభిషేక్ పోరెల్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ ముగ్గుర్ని కమిన్స్.. కీపర్ క్యాచ్‌గానే పెవిలియన్ చేర్చడం గమనార్హం.