Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కాదు.. అతని వల్లే ఆర్‌సీబీకి విజయాలు: సునీల్ గవాస్కర్

ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే ఏం చేయాలో 17 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి తెలిసొచ్చిందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. కెప్టెన్‌గా రజత్ పటీదార్ ఆకట్టుకుంటున్నాడని కొనియాడాడు. అతని కూల్ కెప్టెన్సీతో ఆర్‌సీబీకి వరుస విజయాలు దక్కాయని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో కొనసాగుతోంది.

జియో హాట్‌స్టార్ ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. ఈ మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీతో పాటు రజత్ పటీదార్, కృనాల్ పాండ్యాలు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. ఈ సందర్భంగా గవాస్కర్.. కోహ్లీ, రజత్ పటీదార్ కెప్టెన్సీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో విశ్లేషించాడు.

IPL 2025 Sunil Gavaskar hails Rajat Patidars impactful captaincy at RCB

కోహ్లీ, పటీదార్ కెప్టెన్సీకి తేడా ఇదే..
'రజత్ పటీదార్ చాలా రిలాక్స్‌గా కెప్టెన్సీ చేస్తున్నాడు. గత 17 ఏళ్లుగా ఆర్‌సీబీ ఒక్క టైటిల్ లేకుండా కొనసాగుతోంది. ఇప్పుడు ఆర్‌సీబీకి టైటిల్ గెలవాలంటే ఏం చేయాలో బాగా అర్థమైంది. ప్రశాంతంగా ఉంటూ రజత్ పటీదార్ జట్టును నడిపిస్తున్నాడు. రజత్ పటీదార్ చాలా కూల్ కెప్టెన్. ఈ విషయంలో కోహ్లీ కాస్త దూకుడుగా ఉండేవాడు. ఈ సారి ఇతర ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకొని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆటగాళ్లకు టీమ్ మేనేజ్‌మెంట్ మద్దతు కూడా చాలానే ఉంది. గత సీజన్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ ఆట తీరులో చాలా మార్పు కనబడుతోంది. లాఫ్టెడ్ షాట్లు కొడుతుండటంతో కోహ్లీ మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. దినేశ్ కార్తీక్ మెంటార్‌గా ఉంటూ యువ క్రికెటర్లతో నిరంతరం మాట్లాడుతూ వారిలో ఉత్సాహం నింపడం అద్భుతం. ఇలాంటి వాతావరణం ఉండటం కెప్టెన్‌గా రజత్ పటీదార్ పని సులువు అవుతోంది.

అతను మరో వినూ మన్కడ్..
కృనాల్ పాండ్యా చాలా తెలివైన బౌలర్. మైదానంలో అతను చాలా చురుకుగా ఉంటాడు. చిన్న చిన్న లోపాలను కూడా అతనికి అనుకూలంగా మార్చుకుంటాడు. వాస్తవానికి అతనిలో లోపాలు ఎక్కువగా ఉండవు. అతను మంచి బ్యాటర్.. కృనాల్ బౌలింగ్ చూస్తుంటే నాకు వినూ మన్కడ్ గుర్తొస్తాడు. మన్కడ్ కూడా బంతిని పెద్దగా టర్న్ చేసేవాడు కాదు. కానీ అతని బౌలింగ్‌లో వైవిధ్యం ఉండేది.

లైన్ అండ్ లెంగ్త్‌, పేస్‌లో మార్పులు చేసేవాడు. అప్పుడప్పుడు బౌన్స్, హై ఫుల్‌టాస్, బీమర్‌లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు. కృనాల్ పాండ్యా‌లో కూడా అలాంటి వైవిధ్యమే ఉంది. ఇలాంటి బౌలర్‌‌కు ఆఖరి ఓవర్ ఇవ్వడం నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. అతనిపై కెప్టెన్‌కు అలాంటి నమ్మకం ఉంది.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, April 8, 2025, 16:19 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+