Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: కావ్య పాప.. అత్యాశకు పోయి వజ్రాల్లాంటి ఆటగాళ్లను వదిలేసావ్!

"బంగారం కోసం వెతుకుతూ వజ్రం కోల్పోయాం" ఈ సామెత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ప్రతీ అభిమానికి ఇదే అభిప్రాయం కలుగుతోంది. గతేడాది అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తృటిలో టైటిల్ చేజార్చుకుంది. టైటిల్ గెలవకపోయినా.. ఆరెంజ్ ఆర్మీ ఆట తీరు అభిమానులను ఆకట్టుకుంది. దాంతో సన్‌రైజర్స్‌కు గతంలో లేని విధంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు గత కోర్‌ టీమ్‌ను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆక్షన్‌లో కోట్లు కుమ్మరించి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాంతో ఆన్‌ పేపేర్ చాలా బలంగా కనిపించింది. ఎంతలా అంటే.. కప్ గెలవడం ఖాయమని అందరూ చెప్పుకనేంత. అందరి అంచనాలకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోర్ చేసి ఘన విజయాన్నందుకుంది. దాంతో ఈ సారి టైటిల్‌ సన్‌రైజర్స్‌దేనని ఫ్యాన్స్ హడావుడి చేశారు.

In Search Of Gold We Lost A Diamond SRH Fans Criticize Kavya Maran s Decision to Reject Bhuvneshwar Kumar

పేరు గొప్ప ఊరు దిబ్బ..
కాటేరమ్మ కొడుకులు అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ లేపారు. కానీ రెండో మ్యాచ్‌కే ఆరెంజ్ ఆర్మీ అసలు స్వరూపం బయట పడింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా జట్టు పరిస్థితి మారిపోయింది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడింది. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. షమీ, హర్షల్ పటేల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసి భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సెన్ ప్రత్యర్థి జట్ల తరఫున దుమ్మురేపుతున్నారు.

తేలిపోయిన షమీ.. దుమ్మురేపుతున్న భువీ
ఐపీఎల్ 2014 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ వరకు మొత్తం 11 ఏళ్ల పాటు ఆరెంజ్ ఆర్మీకి ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్ కుమార్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ అతన్ని కొనుగోలు ప్రయత్నం చేయలేదు. దాంతో అతన్ని ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. స్వింగ్ కింగ్ అయిన భువీ.. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు తీసాడు. అతని ఎకానమీ 7.73 కావడం విశేషం. గతేడాది భువీ 16 మ్యాచ్‌లు ఆడి 9.35 ఎకానమీతో 11 వికెట్లు తీసాడు.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన భువీ.. సన్‌రైజర్స్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కానీ అతన్ని కాదని షమీని తీసుకున్న సన్‌రైజర్స్ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన షమీ.. 10.88 ఎకామీతో 5 వికెట్లే తీసాడు. ధారళంగా పరుగులిస్తూ జట్టు ఓటమికి కారణమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిన మార్కో యాన్సెన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన మార్కో యాన్సెన్ 9.24 ఎకానమీతో 8 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో 34 సగటుతో 68 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ వదిలేసిన అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్, వానిందు హసరంగా‌లు కూడా సత్తా చాటుతున్నారు.

Story first published: Monday, April 21, 2025, 16:22 [IST]
Other articles published on Apr 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+