For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs GT: అదే మా కొంపముంచింది: శుభ్‌మన్ గిల్

బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న గుజరాత్ టైటాన్స్‌కు ఈ ఓటమితో వచ్చే నష్టం పెద్దగా లేకున్నా.. టాప్-2లో నిలిచే అవకాశాలపై ప్రభావం చూపనుంది.

అలా చేసుంటే..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. 15-20 పరుగులు తక్కువగా ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. 'బౌలింగ్‌లో మేము 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. లక్నోను మేం 210-220 పరుగులకు కట్టిడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఈ అదనపు పరుగులే మా విజయవకాశాలను దెబ్బతీసాయి.ప్లేఆఫ్స్‌కు సన్నాహకంగా ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయలేదు. నిజం చెప్పాలంటే పవర్ ప్లేలో మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ మాకు వికెట్లు దక్కలేదు.

IPL 2025 Shubman Gill says We gave 15-20 extra after LSG beat GT by 33 runs

అయితే 14 ఓవర్లలో లక్నో 180 పరుగులు చేసింది. ఇది చాలా ఎక్కువ. ఛేజింగ్‌లో 17వ ఓవర్‌ వరకు మేం మ్యాచ్‌లోనే ఉన్నాం. షారుఖ్ ఖాన్, రూథర్‌ఫర్డ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తదుపరి మ్యాచ్‌ గెలిచి ప్లే ఆఫ్స్‌కు ముందు మూమెంట్ అందుకోవడం ముఖ్యం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

మిచెల్ మార్ష్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓటమిపాలైంది. షారుఖ్ ఖాన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 35), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 38) రాణించాడు. లక్నో బౌలర్లలో విల్ ఓ రూర్కీ(3/27) మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్(2/51), ఆయుష్ బదోని(2/4) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆకాశ్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లక్నో.. ఓదార్పు విజయాన్నందుకుంది.

Story first published: Friday, May 23, 2025, 8:00 [IST]
Other articles published on May 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+