Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: సీఎస్‌కే ఓటమి.. కన్నీటి పర్యంతమైన శృతి హాసన్! (వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆ జట్టు ఏడో ఓటమిని మూటగట్టుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. ఈ టోర్నీలో సీఎస్‌కే ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ ఐదింటికి ఐదు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అద్భుతం జరిగితే తప్పా సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరలేదు.

ఇక ఈ మ్యాచ్‌కు హాజరైన సౌతిండియా స్టార్ హీరోయిన శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టకోలేకపోయింది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక బోరున విలిపించింది. చెన్నై ఓటమి ఖాయమని తెలిసిన క్షణమే తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీటిని తన చేతి వేళ్లతో తుడుచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో నెట్టింట వైరల్‌గా మారింది. సీఎస్‌కేకు శృతి హాసన్ డైహార్డ్ ఫ్యాన్ అని, ఓటమిని తట్టుకోలేకపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

IPL 2025 Shruti Haasan spotted crying after CSK losses to SRH in Chennai
Photo Credit: twitter (X)

తమిళనాడుకు చెందిన శృతి హాసన్.. స్టార్ హీరో కమల హాసన్ కూతురు అన్న విషయం తెలిసిందే. తెలుగులో కూడా శృతి హాసన్ సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లోనూ ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మ్యాచ్‌లకు శృతి హాసన్‌తో పాటు తమిళ స్టార్ హీరోలు అజిత్, శివ కార్తీకేయన్‌లు సతీసమేతంగా హాజరయ్యారు. అజిత్ దంపతులతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ప్రత్యేకంగా మాట్లాడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), ఆయుష్ మాత్రే(19 బంతుల్లో 6 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/28) నాలుగు వికెట్లతో సీఎస్‌కే పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44), కామిందు మెండీస్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Story first published: Saturday, April 26, 2025, 12:02 [IST]
Other articles published on Apr 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+