For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs DC: ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: శ్రేయస్ అయ్యర్

బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో పంజాబ్ తమ టాప్-2 ప్లేస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. మార్కస్ స్టోయినీస్(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్), జోష్ ఇంగ్లీస్(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) దూకుడుగా ఆడారు.

ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/33) మూడు వికెట్లు తీయగా.. విప్రజ్ నిగమ్(2/38), కుల్దీప్ యాదవ్(2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ముఖేష్ కుమార్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 నాటౌట్), కరుణ్ నాయర్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/41) రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ప్రవీన్దూబే చెరో వికెట్ పడగొట్టారు.

IPL 2025 Shreyas Iyer Says We weren t disciplined enough with ball After DC beat PBKS

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని తెలిపాడు.'ఈ పిచ్‌పై 207 అద్భుతమైన స్కోర్. ఈ వికెట్‌పై వేరియేబుల్ బౌన్స్ ఉంది. అంతేకాకుండా బంతి వేగంలో వ్యత్యాసం ఉంది. మేం క్రమశిక్షణతో బౌలింగ్ చేయలేదు. మేం ఈ పిచ్‌కు తగ్గట్లు స్టంప్స్‌ లైన్‌లో హార్డ్ లెంగ్త్‌లో బంతిని హిట్ చేయాలనుకున్నాం. కానీ వికెట్లు తీయాలనే ప్రయత్నంలో ఎక్కువ బౌన్సర్లు వేసాం.

ఈ టోర్నీలో ప్రతీ జట్టు బలంగానే ఉంటుంది. సానుకూలంగా, ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మేం పటిష్టమైన ప్రణాళికలతో తదుపరి మ్యాచ్‌లో బరిలోకి దిగుతాం. నాకు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు. కేవలం వేలికి చిన్నగాయమైంది. తదుపరి మ్యాచ్‌కు నయమవుతోంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, May 25, 2025, 6:57 [IST]
Other articles published on May 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+