Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నా: శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఔట్ ఫీల్డ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఎంచుకున్నా. మా నిర్ణయం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో మా ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందిస్తే మిగతా బ్యాటర్లు అందిపుచ్చుకున్నారు. దాంతోనే ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు మాకు విజయం దక్కింది. ఐపీఎల్‌లో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లే మ్యాచ్‌లను గెలిపించడంతో పాటు టైటిల్ అందిస్తారు. మా జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్‌కు ‌మరింత చేరువవుతాం. మేం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

IPL 2025 Shreyas Iyer Reveals The Reason Why PBKS opt to bat vs DC

మరోవైపు టాస్ గెలిచినా తాను బౌలింగ్‌ ఎంచుకునేవాడినని అక్షర్ పటేల్ తెలిపాడు.'వర్షభావ పరిస్థితుల్లో ఛేజింగ్ చేయడమే ఉత్తమం. పిచ్‌లో పెద్దగా మార్పు ఉండదు. లక్ష్యాన్ని ఎలా ఛేదించాలో మా బ్యాటర్లకు బాగా తెలుసు. ఇదో సుదీర్ఘమైన టోర్నీ. సానుకూలంగా ఉండటం ముఖ్యం.. విప్రజ్ నిగమ్ స్థానంలో మధవ్ తివారి జట్టులోకి వచ్చాడు.'అని అక్షర్ పటేల్ తెలిపాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గంట సమయం వృథా అయినా ఒక్క ఓవర్ కూడా కుదించలేదు. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు కీలకం.

తుది జట్లు

ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(కెప్టెన్), కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Thursday, May 8, 2025, 20:36 [IST]
Other articles published on May 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+