For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. కోహ్లీ, రోహిత్‌కు దక్కని రికార్డ్!

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చడమే కాకుండా.. క్వాలిఫయర్-1‌కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో 19 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది.

గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన అతను ఆ జట్టును టాప్ ప్లేస్‌లో నిలిపి క్వాలిఫయర్-1కు తీసుకెళ్లాడు. గతేడాది కేకేఆర్ కెప్టెన్‌గా ఆ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌ను క్వాలిఫయర్-1కు తీసుకెళ్లాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్తే మూడు జట్లను ఫైనల్ చేర్చిన కెప్టెన్‌గా కూడా నయా చరిత్రను లిఖించనున్నాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్‌ కూడా ఈ ఫీట్ సాధించలేదు. శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది.

IPL 2025 Shreyas Iyer Makes History as First Captain to Lead Three Teams to Qualifier 1

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. మరోసారి సూర్యకుమార్ యాదవ్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో ఆదుకోగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26), నమన్ ధిర్(12 బంతుల్లో 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రియాన్ష్ ఆర్య(35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), జోష్ ఇంగ్లీస్(42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిచెల్ సాంట్నర్(2/41) రెండు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Tuesday, May 27, 2025, 8:32 [IST]
Other articles published on May 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+