ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. కాస్త వాతావరణం మేఘావృతమై ఉంది. పిచ్ కూడా కవర్ల కింద ఉంది. ఇది మాకు ఓ కొత్త గేమ్. మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం. జట్టులోని వాతావరణం బాగుంది. తుది జట్టులో ఒక మార్పు చేశాం. యుజ్వేంద్ర చాహల్ రీఎంట్రీ ఇస్తున్నాడు.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. పరిస్థితులను అందిపుచ్చుకొని మేం బాగా బ్యాటింగ్ చేయాలి. పిచ్ చాలా ఫ్లాట్‌గా మారింది. బాగా బౌలింగ్ చేస్తే పిచ్ నుంచి సహకారం లభిస్తుంది. మేం చాలా విషయాల్లో మెరుగవ్వాలి. ఒక రోజు విశ్రాంతి. కాస్త కష్టమే. కానీ ఏం చేయాలో మాకు తెలుసు. గత మ్యాచ్ ముగిసిన తెల్లారే ఇక్కడికి వచ్చాం. చాలా ఆటగాళ్లు రికవరీపై ఫోకస్ పెట్టారు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. గ్లీసన్ గాయపడటంతో రీస్ టాప్లీ ఆడుతున్నాడు.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

తుది జట్లు
పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జేమీసన్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ.