ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ఇది తొలి విజయం కావడం గమనార్హం. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో జోష్ హజెల్ వుడ్ అసాధారణ ప్రదర్శనతో ఆర్‌సీబీ విజయాన్నందుకుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ఆర్‌సీబీ మహిళా క్రికెటర్, భారత స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ హాజరైంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను శ్రేయాంక పాటిల్ ఆస్వాదించింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసును దోచేసింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగడంతో గొళ్లు కొరుకుతూ.. శ్రేయాంక పాటిల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నెట్టింటిని షేక్ చేస్తోంది. ప్రస్తుతం శ్రేయంక పాటిల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆర్‌సీబీ బ్యూటీ రాకతోనే జట్టుకు అదృష్టం కలిసొచ్చిందని, ఓడిపోయే మ్యాచ్‌లో విజయం దక్కిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవడంపై శ్రేయాంక పాటిల్ సంతోషం వ్యక్తం చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది. 'వారెవ్వా ఆర్‌సీబీ పోరాటం అద్భుతం. ఈ విజయం ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. వాటే గేమ్. లవ్ యూ ఆర్‌సీబీ'అనే క్యాప్షన్‌తో మ్యాచ్‌కు హాజరైన ఫొటోతో పాటు.. హజెల్ వుడ్‌ను కోహ్లీ ఎత్తుకున్న ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ స్టోరీ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
గాయం కారణంగా డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌కు శ్రేయాంక పాటిల్ దూరమైంది. ఆర్‌సీబీ కీలక స్పిన్నర్ అయిన శ్రేయాంక పాటిల్.. స్మృతి మంధాన టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. భారత్ తరఫున కూడా మెరుగైన ప్రదర్శన చేసింది.
శ్రేయాంక పాటిల్‌తో పాటు ఈ మ్యాచ్‌కు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా హాజరైంది. ఆర్‌సీబీకి మద్దతుగా సింధు కుటుంబ సభ్యులతో మైదానానికి వచ్చింది. ఆమె సోదరితో పాటు భర్త కూడా ఆర్‌సీబీకి మద్దతుగా మ్యాచ్‌ను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి.